ఈ మద్య బూతు కంటెంట్ చిత్రాలు బాగా వస్తున్నాయి.  లిప్ లాక్ సీన్లు, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్ల తో ఏదో కాస్త స్టోరీ లైన్ తీసుకోవడం.. లేదా హర్రర్ కంటెంట్ యాడ్ చేయడం.. మరికాస్త కామెడీ టచ్ చేయడం.. మొత్తానికి సినిమా అయ్యిందని మమా అనడం పరిపాటైంది.  అయితే చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే ఆ మూవీ టాక్ వేరే ఉంటుంది.. మంచి లాభాలు కూడా ఉంటాయి.  కానీ ఇటీవల బూతు కంటెంట్ ఉన్న చిత్రాలు టీజర్, ట్రైలర్ తో యూత్ లో ఆసక్తి రేపడం.. తీరా థియేటర్లోకి వెళ్లి చూస్తే అంచనాలకు పూర్తిగా తలకిందులు చేయడం కామన్ అయ్యింది.  ఆడియన్స్ థియేటర్లో నుంచి బయటకు వస్తూ ఇంత చెత్త సినిమా మా జీవితంలో చూడలేదు బాబో అని కామెంట్ చేయడం గమనిస్తూనే ఉన్నాం.  

 

అయితే ప్రేమ కథా, కుటుంబ నేపథ్యంలో వచ్చే చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది.  ముని, కాంచన,గీతాంజలి లాంటి హర్రర్ కాన్సెప్ట్ చిత్రాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఆ మద్య వచ్చిన అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి బోల్డ్ సినిమాల్లో మంచి ప్రేమ కోణం ఉండటంతో ఈ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్లు రాబట్టాయి.  తాజాగా 'డిగ్రీ కాలేజ్' సినిమాను ప్రదర్శించడానికి వీళ్లేదని నగరంలోని పలు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

 

'డిగ్రీ కాలేజ్'ని ఒక విద్యాలయంగా కాకుండా అశ్లీలతకు నిలయంగా ట్రైలర్ లో దర్శకుడు సన్నివేశాలను చూపించారని అన్నారు. మరీ దారణమైన విషయం ఏంటంటే ఎంతో పవిత్రంగా భావించే క్లాస్ రూమ్ లో రొమాన్స్ చేస్తూ  అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి ఏపీ, తెలంగాణాలో విడుదల చేయడం, సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వడం దారుణమని అన్నారు.  వెంటనే ఈ చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: