తెలుగు చిత్ర సీమలో ఒకప్పుడు నటసార్వభౌములు నందమూరి తారక రామారావు అభిమానులు ఆయనను ఎన్టీఆర్ అని పిలుస్తారు.. అలాంటి మహానటుడి ప్రశంసలు పొందుతూ.. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో క్రమశిక్షణకు ఆయన కేరాఫ్ అడ్రస్ అంటారు. విలన్, కమెడియన్, హీరోగా విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు మోహన్ బాబు. . దక్షిణాదిలో తెరకెక్కిన ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించి డైలాగ్, కలెక్షన్ కింగ్‌గా మోహన్‌బాబు పేరు తెచ్చుకున్నారు. ఒక్కో నటుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందంటారు.. అయితే మోహన్ బాబు కి మాత్రం తన డైలాగ్సే ప్రత్యేకం. ఆయన పలికే ప్రతి డైలాగ్ పవర్ ఫుల్ పంచ్ ల్లా పేలుతుంటాయి. ఎలాంటి డైలాగైనా చిటికెలో చెప్పగల వాగ్ధాటి ఆయనకు ఉంది.
కేవలం నటుడిగానే కాకుండా, దర్శక, నిర్మాతగా కూడా ఆయన సత్తా చాటారు. ఒక్క సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యారంగంలో ఆయనదైన ముద్ర వేశారు. ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం అడపాదడపా పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత చిరు-మోహన్‌బాబు కలిసి నటిస్తున్నారా..? లేదా? అనే విషయంపై మాత్రం చిత్రబృందం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
తాజాగా మోహన్ బాబు లుక్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. . దీంతో చిరు సినిమా కోసమే మోహన్‌బాబు కొత్తలుక్‌తో ఫొటోషూట్‌లో పాల్గొన్నారంటూ టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. నెటిజన్లు సైతం.. ఆయన లుక్‌ను ప్రశంసిస్తున్నారు. ఒకప్పుడు చిరు-మోహన్ బాబు కాంబినేషన్ అంటే మంచి క్రేజ్ ఉండేది.. మరి ఈ కాంబినేషన్ రిపీట్ అంటూ ఫ్యాన్స్ కి పూనకాలే అంటున్నారు సినీ వర్గాలు.