తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి గురు, శుక్రవారాలంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆ రోజు నవ్వులు పూయించే జబర్దస్త్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో వస్తాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఆఫర్ల కోసం కాళ్లరిగేలా తిరిగిన ఎంతో మంది నటీనటులకు ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షో... ఓ ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఇందులో కాస్తో, కూస్తో పేరు తెచ్చుకుంటే చాలు ఏదో ఒక సినిమాలో ఛాన్స్ దక్కుతోంది. ఇక హైపర్ ఆది, రాకెట్ రాఘవ, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి వాళ్లు రెగ్యులర్‌గా సినిమాల్లో కనిపిస్తున్నారు. 

 

అయితే జబర్దస్త్ కామెడీ షో మొదలు పెట్టి సుమారు ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు ఈ కామెడీ షోకి ఎంతో మంది వచ్చారు. వెళ్లారు. మళ్లీ వచ్చారు. మళ్లీ వెళ్లారు. స్కిట్‌లు చేసే కంటెస్టెంట్లు, ఆఖరుకు జడ్జిలు కూడా మారారు. నాగబాబు, రోజా లాంటి వారు ఎన్నికల సమయంలో జబర్దస్త్‌కు బ్రేక్ ఇచ్చారు. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకున్నారు. అయితే ఎనిమిదేళ్లలో ప్రసారం అయిన అన్ని ఎపిసోడ్స్‌లోనూ నటించినది ఎవరో తెలుసా? అతడే రాకెట్ రాఘవ. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లు జబర్దస్త్‌ షో ప్రారంభించిన మొదటి ఎపిసోడ్ నుంచి తాజగా ప్రసారం అయిన ఎపిసోడ్ వరకు రాకెట్ రాఘవ కనిపిస్తూనే ఉన్నాడు.

 

అటు జబర్దస్త్, ఇటు సినిమాలు, మధ్య మధ్యలో ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ముందుకు సాగుతున్నాడు రాకెట్ రాఘవ. వాస్త‌వానికి జ‌బ‌ర్ద‌స్త్‌కు రాక‌ముందో ఎంతో క‌ష్టప‌డ్డారు. ముఖ్యంగా కూలీ స్థాయి నుంచి ఈ రోజు లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగారు కూడా. హోటల్లో కప్పలు కడుక్కునే స్థాయి నుంచి అదే హోటల్‌కు చీఫ్ గెస్టులుగా వెళ్లే స్థాయికి ఎదిగారు. మ‌రి రాకెట్ రాఘ‌వ జ‌బ‌ర్ద‌స్త్‌కు ర‌క‌ముందే ఏం ప‌ని చేసేవాడో తెలుసా..? ఈ జబర్దస్త్ కట్టప్ప రాకెట్ రాఘవ దూరదర్శన్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసాడు. ఇప్పుడు ఈయన జబర్దస్త్ కామెడీ షోలో ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు మూడు లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: