తమిళ్ లో విజయ్ సేతుపతి త్రిష నటించగా సూపర్ హిట్ అయిన సినిమా 96. ఈ సినిమాకి అఫీషియల్ తెలుగు రీమేక్ గా వచ్చిన సినిమానే జాను. కోలీవుడ్ లో సక్సస్ అయిన ఈ కల్ట్ మూవీని దిల్ రాజు తెలుగులో నిర్మించారు. మంచి అంచానలతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా లో శర్వానంద్ సమంత జంటగా నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మీద రిలీజ్ కి ముందు అందరికి ఆసక్తి నెలకొన్నప్పటికి అది కొంత శాతమే వర్కౌట్ అయింది. కంప్లీట్ కల్ట్ కంటెంట్ కాబట్టి కామన్ ఆడియన్స్ లో కొంతమంది మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాని తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు సి.ప్రేం కుమార్ తెలుగులోనూ తెరకెక్కించడంతో ఎలాంటి మార్పులు చేయకుండా ఇంకా బాగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు రూపొందించాడు. వాస్తవంగా ఈ కథ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కింది కాబట్టి హాయిగా చూడాలనే తపన ఉండటం సహజం. కానీ నెరేషన్ బాగా నీరసంగా సాగుతుండటంతో మధ్య మధ్యలో ఆడియన్స్ కి ఆసక్తి తగ్గుతుందట. 

 

హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా రూపొందించిన ఈ సినిమాలో స్కూల్ డేస్లో ప్రేమించిన అమ్మాయి తర్వాత పెరిగి పెద్దయి మిడిల్ ఏజ్ వచ్చాక కలిస్తే ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా కథ. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో దర్శకుడు తెరకెక్కించడం విశేషం. ఇక ఈ సినిమాలో లవ్ ఫీల్ ఎక్కడా కాకుండా దర్శకుడు చాలా నీట్ గా చూపించడం సినిమాకి పెద్ద ప్లస్ అయింది. అదే కొంతమంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూత్ ని బాగా అట్రాక్ట్ చేయగలిగాడు దర్శకుడు. ముఖ్యంగా ఈ సినిమాలో శర్వానంద్ సమంత నటనకు అందరూ ఫ్లాటైపోతున్నారు. సమంత శర్వానంద్ తప్ప సినిమాలో ఆకట్టుకునే మరో అంశం లేకపోవడం విశేషం. ఈ సినిమా చూసిన యూత్ అందరూ సమంత శర్వాలో వాళ్ళని ఊహించుకుంటున్నారు.

 

అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మాటేమిటంటే సమంత పక్కన శర్వా అసలు సూటవలేదని. నటన పరంగా ఇద్దరు ఆకట్టుకున్నప్పటికి పేయిర్ పరంగా ఇద్దరికి ఏమాత్రం మ్యాచ్ అవలేదట. కొన్ని సీన్స్ లో సమంత పక్కన శర్వా ఎబ్బెట్టుగా ఉన్నాడట. అయితే ఇలా అనుకోవడానికి ఒక కారణం ఉంది. సమంత నాగ చైతన్య కలిసి నటించిన మజిలీ అందరినీ అన్ని రకాలుగా ఆకట్టుకుంది. దాంతో సమంత పక్కన శర్వాని చూడలేకపోతున్నారు. ఇదే విషయం చైతూ కూడా సమంత తో అన్నాడట. వాస్తవంగా ఈ సినిమాలో ముందు చైతు సమంత నే నటించాలి. కాని కుదరలేదు. దాంతో చైతూ డ్రాపయ్యాడు గాని సమంత మాత్రం కమిటయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: