బాహుబలి సినిమా తర్వాత ఒక మీడియం బడ్జెట్ సినిమా చేస్తానని చెప్పిన రాజమౌళి సడెన్ గా తారక్, చరణ్ తో ఒక మల్టీస్టారర్ సినిమా అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. అది కూడా ఇద్దరు రియల్ సువర్ స్టార్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి గొప్ప వ్యక్తుల పాత్రల్లో వారు కనిపిస్తున్నారు. అయితే సినిమా కథ గురించి ఎన్నో ఊహాగానాలు రాగా వాటికి చెక్ పెడుతూ కథ ఇది రిలీజ్ డేట్ ఇది అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు. రాజమౌళి ఏంటి సినిమా రిలీజ్ ముందే అనౌన్స్ చేయడం ఏంటని అందరు అనుకున్నారు. అయితే ఈమధ్యనే ఆర్. ఆర్. ఆర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తూ ఒక ప్రకటన వచ్చింది. 

 

జూలై 30, 2020కి వస్తుందనుకున్న సినిమా కాస్త 2021 జనవరి 8కి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ మార్పుకి షూటింగ్ పూర్తవ్వకపోవడమే కాదు మరో కారణం కూడా ఉందట. అదేంటి అంటే ఆర్.ఆర్. ఆర్ 2021 సంక్రాంతికి రావడానికి ముఖ్య కారణం మహేష్, అల్లు అర్జున్ అని అంటున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ఈ రెండు సినిమాలు 500 కోట్ల దాకా గ్రాస్ వసూల్ చేశాయి. 

 

ఎంత హీరో క్రేజ్.. సినిమా కథ బాగున్నా సంక్రాంతికి ఈ రేంజ్ కలక్షన్స్ వస్తాయని ఎవరు ఊహించలేదు. అందుకే ఇక సంక్రాంతి కూడా ఒక సూపర్ సీజన్ అయ్యింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో తరహాలో ఎలా లేదన్నా rrr తెలుగులో 200 కోట్ల పైగా రాబట్టే అవకాశం ఉంటుంది. అందుకే ట్రిపుల్ ఆర్ ను 2021 సంక్రాంతికి వాయిదా వేశారు. సో 2021 సంక్రాంతికి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆర్.ఆర్.ఆర్ అదరగొడుతుందని చెప్పొచ్చు. rrr తప్ప ఆ సీజన్ లో ఏ సినిమా రిలీజ్ చేసే సాహసం చేయరని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: