టాలీవుడ్ సెల‌బ్రెటీల పెళ్ళి క‌బుర్లు అంటే ఎవ‌రికి ఇంట్ర‌స్ట్ ఉండ‌దు చెప్పండి. ప్ర‌తిఒక్క‌రికి సెల‌బ్రెటీల పెళ్ళిళ్ళు అంటే చాలు తెగ ఇంట్ర‌స్ట్ ఉంటుంది. వాళ్ళ ఇన్‌ఫ‌ర్మేష‌న్ తెలుసుకోవాల‌ని ఎవ‌ర్ని చేసుకోబోతున్నారు. ఏంటి అన్న విష‌యాల పై ఎక్కువ ఆత్రుత‌గా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ హీరో నిఖిల్ కి  డాక్టర్ పల్లవి వర్మతో ఒక డీసెంట్ ఈవెంట్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుని అభిమానులకు  స‌డెన్ షాకిచ్చాడు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్ధం చేసుకుని సగం పెళ్లయ్యిందనిపించేసారు. ప్రేమైక లోకంలో మధురానుభూతుల్ని ఒక్కొక్కటిగా లీకులిస్తూ అభిమానుల్ని ఊరిస్తున్నాడు నిఖిల్. ఇక ఈ హీరో ఇటీవ‌లో అర్జున్ సుర‌వ‌రం చిత్రంలో న‌టించి మెప్పించాడ‌నే చెప్పాలి.  భీమవరం అమ్మాయి ని గోవా లో ప్రొపొజ్ చేసి తనని మెప్పించి పెద్దల్ని ఒప్పించి ఎక్కడైతే ప్రొపొజ్ చేసాడో అదే గోవా లో నిశ్చితార్థం చేసుకున్నాడు ఈ కుర్ర హీరో.

 

ఇక టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ బ్యాచ‌ల‌ర్ నితిన్. ఆయ‌న పెళ్ళి విష‌యంలో ఎప్ప‌టి నుంచో హాట్ టాపిక్‌గా మారింది టాలీవుడ్. ఇక ఇదిలా ఉంటే.. ఇటీవ‌లే నితిన్ పెళ్ళి ఫిక్స్ అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. పెళ్లి ఏప్రిల్ 15న జరగనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే పెళ్లి వాయిదా పడిందని తాజా సమాచారం. పెళ్లి ఏప్రిల్‌లో కాకుండా మేలో పెట్టుకుందామని నితిన్ ఇంట్లో వారితో చెప్పినట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం భీష్మ చిత్రంతో బిజీగా ఉన్న నితిన్ ప‌ని ఒత్తిడి వల్ల నితిన్ ఏప్రిల్‌లో పెళ్లి పెట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. దుబాయ్‌లోని పలాజో వర్సాచే హోటల్‌ నితిన్ పెళ్లికి వేదిక కాబోతోందట. ఇప్పటికే ఇంట్లో వారు అన్ని ఏర్పాట్లు చేసేశారట. మరో నెల రోజులు పెళ్లి వాయిదా వేశారు కాబట్టి వివాహం దుబాయ్‌లోనే జరుగుతందా లేకపోతే ఇండియాలోనే జరగుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

 

అనుష్క టాలీవుడ్ టాప్ హీరోయిన్‌. అరుంధ‌తి చిత్రంతో లేడీఓరియంటెడ్ చిత్రాల‌కి ప్రాణం పోసిన‌ట్లైంది. ఇక ‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్ లో కూడా ఈమె క్రేజ్ సంపాదించుకుంది. కథా ప్రాధాన్యత ఉన్న అందులోనూ తన పాత్రకి ప్రాముఖ్యత ఉన్న సినిమాలనే ఎంచుకుని ఈమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఈ భామ పెళ్ళి విష‌యంలో చాలా సార్లు చాలా గాసిప్స్ వ‌స్తూనే ఉన్న విష‌యం తెలిసిందే. టీం ఇండియాకు చెందిన ఓ క్రికెటర్ తో అనుష్క ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రికెటర్ పేరైతే బయటకి రాలేదు కానీ.. ఇతనిది నార్త్ ఇండియా అని తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో.. అలాగే అనుష్క ఈ వార్త పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: