అమెజాన్ నెట్ ఫ్లిక్స్ హాట్ స్టార్ జీ 5 సన్ నెక్ట్స్ ల మాదిరిగా ఇప్పుడు అల్లు అరవింద్ మై హోమ్ అధినేతలతో కలిసి భారీ స్థాయిలో ప్రారంభించిన ‘ఆహా’ స్ట్రీమింగ్ పోర్టల్ నిన్న సాయంత్రం అత్యంత ఘనంగా భాగ్య నగరంలో లాంచ్ చేయబడింది. ఇండస్ట్రీ వర్గాలకు చెందిన అనేకమంది ప్రముఖులు పాల్గొన్న ఈ ఫంక్షన్ లోని ఉద్దేశాలు నెమ్మదినెమ్మదిగా బయట పడుతున్నాయి. 


హోయ్ చోయ్ బెంగాలీ రీజినల్ ఆన్ లైన్ ఎంటర్ టైన్ మెంట్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ ను ఆదర్శంగా తీసుకుని తెలుగులో ‘ఆహా’ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్నటి రోజున జరిగిన ఆహా లాంచింగ్ ఫంక్షన్ లో అరవింద్ చేసిన ఉపన్యాసం బట్టి ఆహా ద్వారా అందుబాటులోకి వచ్చే కంటెంట్ లో ఎక్కువ బోల్డ్ కంటెంట్ ఉంటుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.  


ఈ యాప్ ను పేరెంటెల్ గైడెన్స్ తోనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోమని చెప్పి అరవింద్ మరీమరీ చెప్పడంతో ఈ యాప్ లో కంటెంట్ పక్కా బోల్డ్ గా ఉంటుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఆహా కు స్ఫూర్తి అయిన బెంగాలీ హోయ్..చోయ్ కూడా ఇదే దారిలో ఉంటుంది. ఆహా ఫ్లాట్ ఫారమ్ లో డైరక్టర్ క్రిష్ అందిస్తున్న మస్తీ వెబ్ సిరీస్ ట్రయిలర్ కూడా కనిపిస్తున్న నేపధ్యంలో ఆ ట్రైలర్ లో ఉన్న అంశాలు బోల్డ్ కంటెంట్ సందేహాలకు  మరింత బలం చేకూరుస్తున్నాయి. దీనితో అమెజాన్ లాంటి దిగ్గజాలతో పోటీ పడాలి అంటే అరవింద్ ఇలాంటి షార్ట్ కట్స్ కొట్టి తీరాలి అన్న కామెంట్స్ వస్తున్నాయి. 


రానున్న రోజులలో మన తెలుగు నటులతో బాలీవుడ్ లో వస్తున్న అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లు ఇక తెలుగులో కూడ హడావిడి చేయ బోతున్నాయి అనుకోవాలి. ఇప్పటికే సినిమాలో బూతు కంటెంట్ పెరిగిపోతోంది అని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఇప్పడు ఆహా లో కూడ ఇదే బూతు ప్రయోగం మరీ ఎక్కువ అయితే యువత పరిస్థితి ఏమిటి సమాధానం లేని ప్రశ్న..

 

మరింత సమాచారం తెలుసుకోండి: