సినిమాలు రిలీజయ్యాక రికార్డులు రావడం కామన్. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం ఒక్క సైన్ తోనే రికార్డులు సృష్టిస్తున్నాడు. 160కోట్లకు పైగా అందుకొని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. పవర్ స్టారా..మజాకా.. అని జనాలంతా మాట్లాడుకునేలా రీఎంట్రీలో అదరగొడుతున్నాడు పవన్. 

 

పవన కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నాడు అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ పాజిటివ్ వైబ్ పాస్ అయ్యింది. పవర్ స్టార్ సినిమాలతో టాలీవుడ్ కు కొత్త జోష్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక పవన్ వరుసగా మూడు సినిమాలు ఎనౌన్స్ చేయడం, మరో రెండు ప్రాజెక్టులు లైన్ లో ఉండటంతో ట్రేడ్ సర్కిల్ కు కొత్త ఎనర్జీ వచ్చింది. 

 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ వకీల్ సాబ్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామాకు కమిట్ అయ్యాడు పవన్. 

 

గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీశ్ శంకర్ దర్శకత్వంలోనూ నటించబోతున్నాడు పవన్. ఇక ఈ సినిమాలతో పాటు మరో ఇద్దరు దర్శకులు కూడా పవన్ తో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఇద్దరూ పవన్ కోసం వెయిట్ చేస్తున్నారని సమాచారం. 

 

తెలుగు సినిమాల మార్కెట్ రేంజ్ పెరుగుతున్నట్టు, పవన్ కళ్యాణ్ లిస్ట్ లో డైరెక్టర్లు కూడా ఎక్కువవుతున్నారు. ఇప్పటికే ఐదుగురు రెడీగా ఉంటే.. మరో ఇద్దరు దర్శకులు పవన్ తో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. పాత పరిచయంతో పవన్ ని డైరెక్ట్ చేసేందుకు కథలు సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అతనితో పనిచేసిన దర్శకులతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటాడు. ఫ్రెండ్ లిస్ట్ లో చేరిన డైరెక్టర్స్ ని రిపీట్ చేస్తున్నాడు. ఈ ఫ్రెండ్ షిప్ తోనే పవన్ కోసం ప్రయత్నిస్తున్నారట డాలీ, బాబీ. అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ టైమ్ లో బాబీ వర్క్ ని మెచ్చుకున్నాడు పవన్. 


పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు కథలతో వాలిపోదాం అని డిసైడ్ అయ్యారట దర్శకులు. ఒక హీరో కోసం ఇంతమంది దర్శకులు వెయిట్ చేయడం ఓ రికార్డ్ అయితే ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ అందుకుంటోన్న రెమ్యునరేషన్ కూడా సంచలనంగా మారుతోంది. పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూడు సినిమాలతో వందకోట్లకు పైగా అందుకుంటున్నాడు. 

 

పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 35 నుంచి 40కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. సో ఇప్పటి వరకు సైన్ చేసిన మూడు సినిమాలతో 120కోట్ల వరకు అందుకుంటున్నాడని చెప్పొచ్చు. సో రీఎంట్రీలో పవన్ సినిమాలు రిలీజ్ కాక ముందే ట్రేడ్ మార్కెట్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. మరి కమ్ బ్యాక్ లో మంచి ఇన్ కమ్ తెచ్చుకుంటోన్న పవన్, బాక్సాఫీస్ దగగ్ర ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: