తెలుగు సినిమా ప్రజెంట్ జనరేషన్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరే. అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లే 55కోట్లకు పైగా వసూలు చేయడంతో ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయాయి. ఓపెనింగ్ కలెక్షన్లకు సినిమాకు హిట్ టాక్ వస్తే ఇక ఆ సినిమా కొత్త లెక్కలు రాయడం ఖాయం. మొత్తానికి పవన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మిగిలిన హీరోలపై ఎఫెక్ట్ ఉంటుదందనేది సినీ వర్గాల మాట.

 

 

పవన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యం.. వరుసగా మూడు సినిమాలు లైన్ లోకి వచ్చేశాయి. మరో రెండు సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి. సినిమాల్లో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ కు ఈ సినిమాలు, వాటి బిజినెస్ లు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పవన్ కల్యాణ్ సినిమా లెక్కల కిక్కే వేరు. పవన్ మళ్లీ సినిమాల్లోకి రావడంతో మిగిలిన హీరోలు మళ్లీ జాగ్రత్త పడతారని కొందరి అభిప్రాయం. పవన్ తర్వాత రేసులో ఉండేది మహేశ్. వంశీ పైడిపల్లి సినిమా కాస్త ఆలస్యంగా ప్రారంభించాలనుకుని కూడా ముందుకు వచ్చేస్తున్నాడు. పవన్ స్పీడీ కమిట్ మెంట్స్ కూడా ఇందుకు ఓ కారణంగా చెప్తున్నారు.

 

 

రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు వేరే బాషల్లో విడుదలవుతున్నాయి. పవన్ సినిమాలు ఒక్క తెలుగు వెర్షన్ లోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయనేది తెలిసిన విషయమే. దీంతో.. మళ్లీ పవన్ తర్వాతే ఏ హీరో పేరయినా వినబడుతుందని అభిమానుల మాట. పదేళ్లు హిట్లు లేకపోయినా క్రేజ్, బిజినెస్ లో పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. మరి పవన్ రాకతో ఎఫెక్ట్ అయ్యే హీరోలెవరో.. కలెక్షన్లలో మార్పులేంటో చూడాలంటే మూడు నెలలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: