మంచికో చెడుకో.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వ‌త‌హాగా త‌న పార్టీని సొంత కాళ్ల‌పై న‌డ‌ప‌లేన‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. ఈ క్ర‌మంలో టీడీపీతో పొత్తు పెట్టు కుని కొన్నాళ్లు బండిని న‌డిపించినా.. ఇప్పుడు ఆ పార్టీ పూర్తిగా చ‌తికిల ప‌డ‌డంతో కేంద్రంలోని బీజేపీతో ప‌వ‌న్ చేతులు క‌లుపుకొని పొత్తు రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. నిజానికి రాష్ట్రంలో పురందేశ్వ‌రి, క‌న్నా, సోము వీర్రాజుకే కాదు.. కామినేని. వంటి వారికి కూడా ప‌వ‌న్‌తో జ‌ట్టు క‌ట్ట‌డం వ‌ల్ల ఒరిగేది ఏమీలేద‌ని తెలుసు.

 

అయినా కూడా కేంద్రంలోని బీజేపీ ప్ర‌ముఖులు ఇలా నిర్ణ‌యించిన త‌ర్వాత స‌ర్దుకుపోదాం.. అంటూ .. స‌ర్దు కుపోతున్నారు. క‌ట్ చేస్తే.. ప‌వ‌న్ పార్టీ బీజేపీతో పొత్తు మొగ్గ‌లు తొడిగింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అనూహ్యంగా ప‌వ‌న్ దూకుడు చాలా వ‌ర‌కు త‌గ్గిపోవ‌డ‌మే కాకుండా క‌ర్నూలులో హైకోర్టు ఏర్పా టుపై ఆయ‌న మాట కూడా మార్చేశారు. నిజానికి ప‌వ‌న్ ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డ మైకు ప‌ట్టుకున్నా జ‌గన్ ను సెంట్రిక్‌గా చేసుకుని వ్యాఖ్య‌లు సంధించేవాడు. 

 

అయితే, తాజాగా ఆయ‌న హైద‌రాబాద్‌లో నిర్వహిం చిన స‌మావేశంలో జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు చాలా డిస్టెన్స్ మెయింటెన్ చేశారు. అదేస‌మ‌యంలో క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తానంటే.. నేను వ‌ద్ద‌ని చెప్పానా? అంటూ ప‌వ‌న్ ప్ర‌శ్నిం చ‌డం గ‌మ‌నార్హం. నిజానికి గ‌తంలో బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు.. క‌ర్నూలులో హైకోర్టు ఎలా పెడ‌తా రు?  ఇప్ప‌టికే సుప్రీం కోర్టు అమ‌రావ‌తిలో హైకోర్ట‌ను ప్రారంభించింది. 

 

రాష్ట్ర‌ప‌తి నోటిఫై చేశారు. సో.. ఇప్పుడు మారిస్తే ఎలా కుదురుతుంది? అని ప‌వ‌న్ వ్యాఖ్యించారు. కానీ, ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుని హైకోర్టు క‌ర్నూలులో పెట్టుకుంటే నేను వ‌ద్ద‌న్నానా? అని ఎదురు ప్ర‌శ్నించాడు. ఈ ప‌రిణామాలు చూస్తే.. కేంద్రంలోని బీజేపీ పూర్తిగా ప‌వ‌న్‌ను మానిట‌రింగ్ చేస్తోంద‌నే భావ‌న స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: