టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న అల్లు అరవింద్ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు.  అయితే అల్లు అరవింద్ ప్రముఖ హాస్యనటులు అల్లు రామలింగయ్య తనయులు.  గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో  అల్లు అరవింద్ నటించారు.  నటుడిగా, నిర్మాతగా సినీ రంగంలో ఎన్నో సేవలు అందించిన ఆయన తనయుడు అల్లు అర్జున్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ హీరోగా వెలిగిపోతున్నారు.  ఈ ఏడాది అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురములో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

 

ఈ సందర్భంగా తన తనయుడి విజయం ఎంతో గొప్ప సంతృప్తిని ఇచ్చిందని పలు ఈవెంట్స్ లో అన్నారు అల్లు అర్జున్.  తాజాగా  పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ యాప్ ని తెలుగు వారికోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు.  ఇప్పుడు డిజిటల్, వెబ్ మీడియాలో కూడా సినిమా దూసుకుపోతోంది.

 

థియేటర్స్ లో విడుదలైన కొన్నిరోజులకే డిజిటల్ మిడియాలో సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాకు డిమాండ్ పెరుగుతోంది.  OTT రంగంలోకి అడుగుపెట్టేస్తున్నారు. ఈ సంధర్భంగా అల్లు అరవింద్ 'ఆహా' అనే యాప్ లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

ఈ కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.  అలాంటి వారికి ఉపయోగంగా ఉండే విధంగా యాప్ క్రియేట్ చేశారు. దాదాపు 25 షోలు ఈ యాప్ లో ఉండబోతున్నాయి. అందులో బోల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి తల్లి దండ్రులు  తమ పిల్ల విక్షించే విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలని అల్లు అరవింద్ అంటున్నారు. ప్రతి ఒక్కరికీ అనందం అవసరం అవి హద్దుల దాటనంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు.  తమ యాప్ ఆనందానికి వాడాలనే ఉద్దేశంతో చేశామని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: