సినిమా కథ కథనాలు ఎలా ఉన్నా అందరు సినిమా నుండి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోడానికి రారు.. సరదాగా ఓ రెండున్నర గంటలు ఎంజాయ్ చేసి వెళ్దామని వస్తారు. అలాంటి వారిని నవ్వించి.. ఏడిపించి.. థ్రిల్ చేస్తూ రకరకాల జానర్లలో సినిమాలు చేస్తారు. అయితే కొన్ని సినిమాల్లో హీరోయిన్ అందాలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా చేస్తారు. యువ హీరోల సినిమాల్లో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతాయి. అయితే లేటెస్ట్ గా నితిన్ హీరోగా తెరకెక్కుతున్న భీష్మ సినిమా కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నట్టు ఉన్నారు.

 

నితిన్, రష్మిక జంటగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ. ఫిబ్రవరి 21న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ చూస్తే రష్మిక ఫుల్ గ్లామర్ టచ్ ఇచ్చినట్టు ఉంది. అంతేకాదు ఛలో నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తనలోని నటన చూపించిన రష్మిక భీష్మలో మాత్రం తనలోని హాట్ యాంగిల్ చూపిస్తుందట. భీష్మ టీజర్, సాంగ్స్ చూస్తే అది నిజమే అనక తప్పదు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో నితిన్, రష్మిక జోడీ అలరించనుంది.

 

ఛలో, గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు ఐదు సినిమాలతోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంది రష్మిక మందన్న. నితిన్ భీష్మ పూర్తవగా త్వరలోనే మొదలవుతున్న సుకుమార్, అల్లు అర్జున్ కాంబో మూవీలో అమ్మడు నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా త్రివిక్రం, తారక్ కలిసి చేస్తున్న సినిమాలో కూడా రష్మిక సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. భీష్మతో రష్మికకు కొత్త ఇమేజ్ రావడం ఖాయం.. మరి సాంగ్స్ లో ఇలా రెచ్చిపోయిన రష్మిక సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. ఈ మూవీపై నితిన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: