మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్‌ సుధా మూర్తి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్‌ సుధా మూర్తి వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ కి సంబంధించి అనేక విషయాలు పంచుకుంది. తన చిన్నతనంలో ఎక్కువగా నందమూరి ఎన్టీఆర్ సినిమాలు చూసే దానిని అంటూ తెలిపింది. ఎన్టీఆర్ నటించిన  'మాయాబజార్‌', 'దాన వీర శూర కర్ణ', 'సీతా స్వయంవరం' సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కృష్ణుడు ఎలా ఉంటాడో తనకు తెలియదు కానీ కృష్ణుడు అనే పేరు రాగానే ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ రూపమని ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇటీవల చూసిన సినిమాలు రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' చూశానని సినిమాలో రామ్ చరణ్ నటన చాలా బాగుందని అద్భుతంగా నటించాడు అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.

 

ఇదే తరుణంలో ప్రస్తుత కుర్ర హీరోలలో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని చాలా బాగుంటాడు అంటూ విజయ్ దేవరకొండ అందంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరియు అదే విధంగా చాలా బాగా యాక్ట్ చేస్తాడు అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. కచ్చితంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోని టాప్ స్టార్ హీరో అవుతాడని జోస్యం చెప్పింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తారీఖున విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక చాలా ఘనంగా ఇవ్వాలా జరిగింది. 

 

భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక నలుగురు హీరోయిన్లు నటించడం జరిగింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదల అయ్యి అదిరిపోయే రేంజిలో సోషల్ మీడియాలో ఆదరణ దక్కించుకుంది. అర్జున్ రెడ్డి సినిమా టైపులో విజయ్ దేవరకొండ లుక్ ఉండటంతో వరల్డ్ ఫేమస్ లవర్ పై చాలా అంచనాలు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. దీంతో ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్‌ సుధా ఇంకా అనేక విషయాలు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: