టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు ఎన్నో గుప్త దానాలు చేస్తారని తెలిసిన విషయమే.  మెగాస్టార్ ఎన్నో దాన ధర్మాలు చేసినా పెద్దగా ప్రచారాలు చేసుకోరు అన్న విషయం తెలిసిందే.  తండ్రి బాటలోనే తనయుడు అన్నట్లు రామ్ చరణ్ కూడా ఎంతో మందికి తన వంతు సహాయం అందిస్తూ ఉన్నా.. ఎక్కడా పెద్దగా ప్రచారం చేసుకోరు.   టాలీవుడ్‌లో మెగాభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మెగా హీరోల బలం, బలహీనత ఏదైనా ఉంది అంటే వారి అభిమానులే.  ఒక్క మెగా హీరోలే అని కాదు.. అందరి హీరోలకు ఇది వర్తిస్తుంది.  తన అభిమాని మృతి విషయం తెలిసిన వెంటనే నూర్ మహ్మద్ ఇంటికి వెళ్లిన చిరంజీవి.. తన వీరాభిమాని మరణం తీరని లోటని బాధను వ్యక్తం చేశారు. తోటి అభిమానులందరికీ బాధాకరమైన సంఘటన అని అన్నారు.

 

నూర్ బాయ్ మృతి చెందిన సమయంలో షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న రామ్ చరణ్ హైదరాబాద్ రాగానే ఆ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారం నూర్ బాషా కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు. నూర్ బాయ్ కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పారు. ఆర్థిక సాయం కింద రూ.10 లక్షల చెక్కును వారికి అందజేశారు.  ఆ మద్య నూర్ మహమ్మద్ మరణ వార్త తెలిసిన వెంటనే.. మెగాస్టార్ చిరంజీవి సికింద్రాబాద్ లోని నూర్ ఇంటికి స్వయంగా వెళ్లారు.

 

నూర్ మహమ్మద్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చారు.  ఆ సమయంలో నూర్ మహ్మద్ కుటుంబానికి చిరంజీవి ధైర్యం చెప్పారు.  నూర్ బాయ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదరిస్తానని.. అలాగే నూర్ బాయ్ కుమారుడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, ఇద్దరు కూతుళ్ల వివాహానికి తాను వస్తానని మాట ఇచ్చారు రామ్ చరణ్.  ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్ ’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: