టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కి అరెంజ్ట్ గా ఒక హిట్ కావాలి. కాని ఎలా అంటూ మన్మధుడు తెగ మదన పడుతున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత ఈ చిన్ని నాయనకి మళ్ళీ హిట్ పడలేదు. నానితో మల్టి స్టార్ గా దేవదాస్ సినిమాని ఎన్నో ఆశలు పెట్టుకొని చేశాడు. కానీ భారీ డిజాస్టర్ అయింది. అంతకముందు కోడలు సమంత తో కలిసి రాజుగారి గది సినిమా చేశాడు. అదీ బెడిసి కొట్టింది. ఇక రాం గోపాల్ వర్మ తో తీసిన ఆఫీసర్ కూడా భారీ ఫ్లాప్ గా మిగిలింది. అసలు ఇలాంటి సినిమా వర్మ నాగార్జున నుండి ప్రేక్షకులు ఊహించనేలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇండస్ట్రీ రికార్డ్ అయిన శివ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు ఈ క్రేజీ కాంబినేషన్ రిపీటవుతుండటంతో ప్రేక్షకులతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ చాలామందిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

కానీ ఆ అంచనాలన్ని తారుమారయ్యాయి. టేకింగ్ పరంగా, టెక్నికల్ పరంగా సినిమా సూపర్బ్ అన్న మాట వినిపించినప్పటికి భారీ ఫ్లాప్ ని మూటగట్టుకుంది. ఆ తర్వాత ఒకప్పటి భారీ బ్లాక్ బస్టర్ మన్మధుడు సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 ని రూపొందించారు. రకుల్ ప్రీత్ సింగ్ నాగ్ సరసన ఈరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంతా ఇంతా కాదు. ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్ తో ఈ పిచ్చి రొమాన్స్ ఏంటి..అసలు అడల్ట్ సినిమాలో ఉన్నట్టుగా లిప్ కిస్సులేంటి నాగ్ ని ఆయన ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా నాగార్జునని నానా మాటలన్నారు. ఆ దెబ్బకి నాగ్ కి మైండ్ బ్లాకయింది. ఇక రకుల్ పరిస్థితైతే చెప్పలేము. 

 

దాంతో ఇక నాగ్ ఎలాంటి సినిమా చేయాలా అని తల బాదుకుంటున్నాడు. ఆ క్రమంలోనే వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా మళ్ళీ విజృభించడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల రిల్లిజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా గాక బాలీవుడ్ లో నాగ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. అదే బ్రహ్మాస్త్ర. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ తో సహా మరికొందరి క్రేజీ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా 150 కోట్ల తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. అయితే ఈ సినిమా నాగార్జున కి ఎంతవరకు కలిసి వస్తుందో అని అక్కినేని ఫ్యాన్స్ సందేహపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: