టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-సుకుమార్ కామొనేషన్ లో వచ్చిన '1' నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కృతి సనోన్. మొదటి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికి ఎందుకనో ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ బ్యూటికి మళ్ళీ తెలుగులో ఛాన్స్ రాలేదు చైతూ తో దోచేయ్ సినిమా తప్ప. అయితే బాలీవుడ్ లో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం స్టేటస్ ని సాధించలేకపోతోంది. 

 

వాస్తవంగా కృతిని మహేష్ సినిమాలో సుక్కూ ఎంపిక చేసుకున్నప్పుడు తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొన్నాడు. అయితే 1 నేనొక్కడినే రిలీజైన తర్వాత మాత్రం మహేష్ అభిమానులు అభిప్రాయం మార్చుకున్నారు. తమ ఫేవరెట్ తో పోటీపోటీగా నటించి కృతి వావ్ అనిపించింది. ఆ తర్వాత చైతన్య సరసన దోచేయ్ సినిమాలో నటించింది. ఆ సినిమాతోను విమర్శలు ఎదుర్కొంది. దాంతో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో బ్యాక్ టు పెవిలియన్ అంటూ బాలీవుడ్ కి వెళ్లిపోయింది.

 

అయితే అక్కడా సరైన హిట్లు లేకపోయినా.. ఈ అమ్మడి ప్రతిభకు గుర్తింపు దక్కింది. దీంతో కెరీర్ పరంగా మాత్రం పెద్ద ఇబ్బందులు లేవు. కెరీర్ సంగతులు ఒకవైపు.. ఎఫైర్ మ్యాటర్స్ ఇంకోవైపు కృతిని నిరంతరం లైమ్ లైట్ లో ఉంచుతున్నాయి. చాలా కాలంగా ధోని ఫేం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమలో మునిగి తేలిన ఈ బ్యూటి ఇటీవలే సుశాంత్ కి బ్రేకప్ చెప్పేసింది. ఇక సోషల్ మీడియాలో కృతి స్పీడ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తాజాగా మెస్మరైజ్ చేసే డ్రెస్ లో తళుక్కున మెరిసింది. ఇదో కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్. ఇందులో విరహంతో వీగిపోయే వయ్యారిభామగా సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది కృతి. ఇందులో జనాలని బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఆ ఫోటోస్ తోనే మేకర్స్ ని కాకా పడుతూ నా ఫిగర్ చూడండయ్యా ..చూసి ఆలోచించండయ్యా అంటుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: