స్టార్ సినిమా అంటే ప్రతిదీ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉండాలి. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి రిలీజ్ వరకు ఒక ఎత్తైతే రిలీజ్ తర్వాత మరో ఎత్తు అని చెప్పాలి. రిలీజ్ ముందు ఈవెంట్లు..  రిలీజ్ తర్వాత ప్రమోషన్స్.. ఇలా అన్ని స్పాన్సర్స్ చూసుకుంటారు. సినిమా బడ్జెట్ రేంజ్ ను బట్టి స్పాన్సర్షిప్ ఉంటుంది. వీరిలో కూడా ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టి గ్రాండ్ గా ప్లాన్ చేస్తారో వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ వస్తుంది. 

 

స్టార్ సినిమా స్పాన్సర్షిప్ వలన జరిగే ప్రయోజనాలు వేరేలా ఉంటాయి. అయితే కొందరు నిర్మాతలు మరీ దారుణంగా స్పాన్సర్ నుండి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. సినిమా అనేది నిర్మాతకు ఒక కంప్లీట్ బిజినెస్ అయ్యిందని తెలిసిందే. అందుకే ప్రమోషన్స్ వేరే వాళ్ల నెత్తిన పెట్టారు. 

 

సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో రెండు సక్సెస్ అవగా ఒక దాన్ని మించి మరో సినిమా ఈవెంట్ చేసుకుంటున్నారు. ఆ ఈవెంట్ ల బిల్లులు మాత్రం నిర్మాతకు సంబంధం ఉండదు. అలా స్పాన్సర్స్ ను వెతుక్కుని పనిచేయాల్సి ఉంటుంది. సినిమా ఒకరిది.. నిర్మాత ఒకరైతే ఈవెంట్ అనగానే స్పాన్సర్స్ వెతుక్కునే పనిలో పడతారు. మరి ఈ ఖర్చులు నిర్మాతలు ఎందుకు భరించరో వాళ్ళకే తెలియాలి.. అయినా స్టార్ క్రేజ్ చూసి మేం స్పాన్సర్ చేస్తాం అని వచ్చిన వారితోనే కదా ప్రొసీడ్ అయ్యేది దానికి ఎందుకు ఇంత సీన్ అనుకునేవారు ఉన్నారు. మరి రానున్న రోజుల్లో సినిమా ఈవెంట్ స్పాన్సర్ లో మార్పులైతే కచ్చితంగా వచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో శ్రేయాస్ మీడియా మాత్రమే సినిమా ఈవెంట్స్ చేస్తుంది.. మొన్నీమధ్యే వజ్ర ఈవెంట్స్ కూడా గ్రాండ్ గా చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఈవెంట్స్ వల్ల సినిమా ప్రమోట్ అవుతున్నా అవి చేస్తున్న వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: