ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకోగా, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా ఆశించిన అంచనాలు అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక కేవలం ఒక రోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలు రెండు మంచి కలెక్షన్స్ సంపాదించి విజయాలు అందుకున్నాయి. అయితే టాక్ పరంగా చూస్తే సరిలేరు ఫస్ట్ డే యావరేజ్ టాక్ సంపాదించగా, అల సినిమా మంచి టాక్ ని సంపాదించింది. కానీ వరుసగా సంక్రాంతి సెలవలు కావడం, 

 

అలానే రెండు సినిమాల్లో కూడా మంచి కమర్షియల్ హంగులు ఉండడంతో రెండూ కూడా ఒకదానిని మించేలా మరొకటి బాగా కలెక్షన్ రాబట్టడం జరిగింది. అయితే రిలీజ్ కు ముందు నుండే ఒక సినిమాను మించి మరొక సినిమా ప్రమోషన్స్ అదరగొట్టగా, రిలీజ్ తరువాత రెండు సినిమాల నిర్మాతల మధ్య కలెక్షన్ వార్ మెల్లగా ముదరడం మొదలయింది. ఒకరోజు ఒకరు మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటూ పోస్టర్ వేస్తే, మా సినిమా అంతకు మించి కలెక్ట్ చేసింది అంటూ వేరొకరు పోస్టర్ వేయడం మొదలయింది. ముందు ఆడియన్స్ లో ఒకింత ఆసక్తిని రేపిన ఈ రెండు సినిమాల కలెక్షన్స్ వార్, ఆ తరువాత వారు నవ్వుకునే పరిస్థితికి దిగజారింది. ఇక ఇటీవల సరిలేరు టీమ్ తమ సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టినట్లు పోస్టర్ వేస్తే, అల టీమ్, తమ సినిమా ఏకంగా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ వేయించారు. 

 

అయితే ఇప్పటికే ఒక సక్సెస్ మీట్ నిర్వహించిన సరిలేరు టీమ్, ఆ తరువాత మహేష్ బాబు విదేశాల్లో ఉండడంతో తదుపరి పెద్దగా ఎటువంటి ఈవెంట్స్ నిర్వహించలేదు. అయితే అల టీమ్ ఇప్పటికే ఒక సక్సెస్ మీట్ తో పాటు మూడు గ్రాండ్ పార్టీలు కూడా జరుపుతుంది. నిజానికి వీటిలో సరిలేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా కలెక్షన్ రాబట్టగా, అల మూవీ ఓవర్సీస్ లో బాగా రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఎంత రెండు సినిమాల వారు పైకి మాములుగా కనపడుతున్నా, లోలోపల మాత్రం, ఏం తమాషాగా ఉందా, మీ సినిమా ఎంత పీకిందో అందరికీ తెలుసు, అసలు మావి కాదు, మీవి ఫేక్ రికార్డులు, ఓవర్ యాక్షన్ చేయవద్దూ అంటూ ఒకరిపై మరొకరు కక్ష ధోరణితో వ్యవహరిస్తున్నట్లు ఈ పోస్టర్ల వార్ ని బట్టి తెలుస్తోందని పలువురు ప్రేక్షకులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: