ఆర్.ఎక్స్ 100 సినిమాలో మత్తెక్కించే కళ్లు.. చూపులతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేసింది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100తో ఒక్కసారి స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఈ దెబ్బతో టాలీవుడ్ లో గట్టిగా నిలబడి కొన్నాళ్ళ పాటు ఏలేస్తుందనుకుంటే ఢమాల్ అంటూ కింద పడిపోయింది. మొదటి సినిమా ద్వారా ఆసాంతం తనకొచ్చిన ఇమేజ్ తో సినిమాలను ఎంపిక చేసుకోవడంలో అమ్మడు తప్పులు మీద తప్పులు చేసింది. ఆ తర్వాత చేసిన ఆర్ డీఎక్స్ లవ్ సినిమాలో హఒ డోస్ ఇచ్చినప్పటికి జనాలు ఎంజాయ్ చేశారు గాని హిట్ ని ఇవ్వలేదు. 

 

దాంతో ఈ సినిమా దారుణంగా ప్లాప్ అయింది. అంతే పాయల్ పరిస్థితి అర్థం కాక అయోమయంలో పడింది. సౌత్ హీరోయిన్స్ మాదిరిగా దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కదిద్దుకోవాలన్న పద్దతిని ఫాలో అవకుండా తనకొచ్చిన ఇమేజ్ తో భారీ ఛాన్సుల కోసం వెయిట్ చేసి.. చివరకు వెంకీ మామలో చేసింది. ఈ సినిమాతో తన స్టార్ గిర్రన తిరిగిపోతుందని భావించినా.. సీనియర్ నటుడితో జత కట్టటం ద్వారా భారీ తప్పు చేసిందన్న టాక్ వినిపించింది. ఇప్పుడు అందుకు తగ్గట్లే పాయల్ పరిస్థితి ఉందని తెలుస్తోంది. 

 

వెంకీమామలో పాయల్ కు పెద్దగా పేరు వచ్చింది ఏమీ లేదు. దీంతో నమ్ముకున్న సినిమా నట్టేట ముంచినట్లుగా తన వాళ్ళ దగ్గర ఫీల్ అవుతుందట. మొదట్లో వచ్చిన అవకాశాల్ని.. ఎంపిక పేరుతో చేజార్చుకున్న ఈ హాట్ బ్యూటీకి ఇప్పటికి డిమాండ్ ఉంది. కానీ.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటు చాలామంది చెబుతుండటంతో పాయల్ టెన్షన్ పడుతూ లోలోపల ఏడుస్తుందట.

 

పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ.. ఈ బ్యూటీకి వస్తున్నవన్నీ చిన్న పాత్రలేనని వాపోతుందట. దీంతో.. ఆమె ప్రస్తుత పరిస్థితి నాలుగు రోడ్ల మధ్య నిలుచున్నట్లుగా ఉందంటున్నారు. అయితే పాయల్ కాస్త రియలైజ్ అవుతూ మొదట్లో తప్పు చేసినప్పటికి వెంకీ మామ, డిస్కో రాజా సినిమాలతో నేనేంటో చూపించాను కదా. ఎంత గ్లామ్ర్ గా అయిన్నా నటించడానికి రెడీ. ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ ఇచ్చినా హార్డ్ వర్క్ చేస్తాను. గ్లామర్ విషయంలోను లిప్ లాక్ విషయంలో ఒకే అన్నా కదా అయినా నన్ను ఇలా రెండు సినిమాలకే వాడుకొని వదిలేస్తారా అంటూ కుమిలిపోతుందట పాయల్. పాపం మేకర్స్ ఎవరైనా పట్టించుకుంటే బావుంటుంద కదా ..!

మరింత సమాచారం తెలుసుకోండి: