అక్కినేని ఫ్యామిలీ చాలా పెద్దది. నాగేశ్వరావు దగ్గర్నుంచి అఖిల్ వరకు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు బాగానే ఉంది. అయితే నాగేశ్వరరావు గారి తర్వాత నాగార్జున టాలీవుడ్ మన్మధుడిగా ఇండట్రీని ఏలుతున్నారు. ఈ మధ్య కాస్త జోరు తగ్గింది గాని టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల్లో నాగ్ కి ఒక బ్రాండ్ ఉంది. రొమాంటిక్ హీరోగా టాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ సపరేట్ అన్న విషయం తెలిసిందే. నాగేశ్వరరావు తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుడిగా నాగార్జున ఆయన పేరుని నటుడిగా నిలబెట్టారు. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలని నిర్మించి సక్సస్ ఫుల్ నిర్మాత అనిపించుకున్నారు. కొత్త దర్శకులకి అవకాశాలివ్వడంలో నాగార్జున తర్వాతే ఎవరైనా అన్న పేరుని నాగార్జున సంపాదించుకున్నారు. సంచలన దర్శకుడైన రాం గోపాల్ వర్మ ఈ రోజు ఒకవైపు టాలీవుడ్, మరోవైపు బాలీవుడ్ ని ఏలుతున్న దర్శకుడిని సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది నాగార్జున అన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

 

అంతేకాదు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ని డైరెక్టర్ గా చేసింది నాగారున నే. ఈ రోజు రాఘవ లారెన్స్ గొప్ప దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీస్తున్నాడంటే ఎంతో మంది అనాధ పిల్లలని ఆదుకుంటున్నాడంటే కూడా అది మన మన్మధుడి ప్రోత్సాహమేనని చెప్పాలి. ఇక నాగార్జున తర్వాత ఆ ఫ్యామీలో మంచి స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంది నాగ చైతన్య. దిల్ రాజు నిర్మాణంలో జోష్ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన చైతూ ఆ తర్వాత ఏం మాయ చేశావే సినిమాతో సక్సస్ ని అందుకున్నాడు. అప్పటి నుంచి చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించి సక్సస్ లను అందుకోని సెటిలైపోయాడు చైతూ. మాస్ సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోయినప్పటికి చైతూకి లవ్ స్టోరీస్ బాగా కలిసొచ్చాయి. ఈ మధ్యనే మేనమామ వెంకటేష్ తో కలిసి నటించిన మల్టిస్టారర్ మూవీ వెంకీ మామ మంచి సక్సస్ ని అందుకుంది. అంతకముందు వచ్చిన మజిలీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. 

 

ఇక ప్రస్తుతం చైతూ క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టోరి అనే సినిమా ప్యూర్ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే అఖిల్ కి మాత్రం ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా పడలేదు. చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. దాంతో అమల చాలా టెన్షన్ పడుతూ అఖిల్ కి హిట్ వచ్చేలా చూడమని నాగ్ తో గోల పెడుతుందట. చైతూని హీరోగా నిలబెట్టారు. అలానే అఖిల్ ని త్వరగా సెట్ చేయమని బాగా ప్రేజర్ చేస్తుందట అమల. దాంతో నాగ్ రంగం లోకి దిగి ఎలాగైనా రెండు హిట్స్ వచ్చేలా దర్శకులకి సూచిస్తూ ఒత్తిడి చేస్తున్నారట. అయితే ఇది ఇప్పుడు చైతూ మెడకి గుదిబండలా తయారైందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అఖిల్ ఫెల్యూర్స్ చైతూని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: