ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కొంచెం బరువు పెరిగితే చాలు తాము లావు అయిపోతున్నాయని భావించి బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఒక లేడీ డ్యాన్సర్ బరువు తగ్గాలనే తాపత్రయంతో ఒక నిషేధిత పిల్ ను మింగింది. ఆ పిల్ ను మింగిన కొంతసేపటికే డ్యాన్సర్ ప్రాణాలను కోల్పోయింది. 

 

పూర్తి వివరాలలోకి వెళితే థానేకు చెందిన 22 సంవత్సరాల వయస్సు గల మేఘన దేవ్ గడ్కర్ వృత్తిరిత్యా లేడీ డ్యాన్సర్ గా పని చేసేది. ఆహారం విషయంలో, శరీరాకృతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొనేది. కొంచెం బొద్దుగా ఉండటంతో ప్రతిరోజు జిమ్ కు వెళ్లి బరువు తగ్గాలని ప్రయత్నించింది. కానీ బరువు తగ్గకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. అదే సమయంలో ఒక పిల్ వాడితే సులభంగా బరువు తగ్గవచ్చని సన్నిహితుల ద్వారా తెలిసింది. 

 

ఆ పిల్ నిషేధిత పిల్ అని తెలిసినప్పటికీ మేఘన మాత్రం బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఆ పిల్ ను వేసుకోగా పిల్ వేసుకున్న కొన్ని గంటల తరువాత మేఘన చనిపోయింది. వైద్యులు మేఘన వేసుకున్న పిల్ చాలా ప్రమాదకరమైనదని ఈ పిల్ వేసుకుంటే శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పేలుడు పదార్థాలకు ఉపయోగించే కెమికల్, ఫర్టిలైజర్స్ రంగుల వలలో ఉపయోగించే కెమికల్ తో ఈ పిల్ తయారైందని వైద్యులు చెబుతున్నారు. 

 

ఈ పిల్ ఎవరైతే వేసుకుంటారో వారికి తలనొప్పి, చెమటలు పట్టడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వాంతులు ఇతర లక్షణాలు కనిపిస్తాయని మేఘనలో ఈ లక్షణాలే మేఘన ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయని తెలిపారు. ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఈ పిల్ మేఘన ఎక్కడ కొనుగోలు చేసిందనే దిశగా విచారణ జరుపుతున్నారు. అధికారుల విచారణ తరువాత ఈ డ్రగ్ మేఘన ఎక్కడ కొనుగోలు చేసిందనే విషయం తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: