దిల్ రాజు.. తెలియని వారు ఉండరు. ఎందుకంటే అయన నిర్మించిన సినిమాలు ఒకటా ? రెండ ఎన్ని సినిమాలు అయన నిర్మించారు. ఎప్పటి నుండో సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు దిల్ రాజు. అందుకే ఇప్పటికి ఫుల్ ఫామ్ లో ఉన్న టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు. అలాంటి ఈ అగ్ర నిర్మాత భార్య గత సంవత్సరం హఠాత్ మరణం చెందారు. 

 

అయితే దిల్ రాజుకు అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు.. వాళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు మనవాళ్ళు దిల్ రాజుకు ఉన్నారు. అతని వయసు 50 సంవత్సరాలు అయినా స్టిల్ ఇంకా యంగ్ గా.. న్యాచురల్ లుక్ తో కనిపిస్తారు దిల్ రాజు. అలంటి ఆహారాన్ని.. వ్యాయామాలు చేస్తారు అయన.. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే అయన భార్య మరణించినప్పటి నుండి ఎప్పుడు పెళ్లి వార్తలు తెర మీదకు రాలేదు. కానీ ఏమైందో తెలియదు నిన్న ఉన్నట్టుండి అయన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి.. అసలు వార్తలు ఏం అని వచ్చాయి అంటే ? దిల్ రాజు పెళ్ళికి సిద్ధం అయినట్టు.. 

 

అయన భార్య మరణించి సంవత్సరం అయినందుకు రెండో వివాహానికి సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు భార్య మరణం తర్వాత ఎప్పుడు సినిమాలు.. బిజినెస్ అని బిజీ అయిపోయిన దిల్ రాజు వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం సమయం కేటాయించడం లేదట.. కుటుంబ సభ్యులను పట్టించుకోవటం లేదట... అందుకే దిల్ రాజు స్నేహితులైన కొందరు దిల్ రాజుని మళ్ళి పెళ్లి చేసుకోవాలి అని ఒప్పించినట్టు సమాచారం. ఇంకా నిజంగానే దిల్ రాజు పెళ్ళికి ఒప్పుకొని ఉంటె.. త్వరలోనే దిల్ రాజు పెళ్లి ఉండనుంది. మరి దిల్ రాజుని చేసుకునే అమ్మాయి ఎవరు? అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్సే.

మరింత సమాచారం తెలుసుకోండి: