డైరెక్టర్ సుకుమార్ చాల సున్నిత మనస్థత్వంతో కూడిన వ్యక్తి అని అంటారు. అందువల్లనే ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన తరువాత కూడ సుకుమార్ సుమారు రెండు సంవత్సరాలు ఖాళీగా ఉండవలసి వచ్చింది. 

 

మహేష్ తో అతడికి ఎదురైన పరాభవానికి అల్లు అర్జున్ సహకారం లభించినా సుకుమార్ కు బన్నీతో లేటెస్ట్ గా మొదలు పెట్టిన మూవీ విషయంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కొన్ని సున్నిత సమస్యలు ప్రస్తుతం సుకుమార్ ని వెంటాడుతున్నట్లు టాక్. ‘అల’ బన్నీ కలలో కూడ ఊహించని ఇండస్ట్రీ హిట్ గా మారడంతో సుకుమార్ తో త్వరలో షూటింగ్ మొదలు పెట్టవలసిన సినిమా విషయంలో బన్నీ సుకుమార్ కు అనేక సూచనలు ఇస్తున్నట్లు టాక్. 

 

మూవీ కథ విషయంలోనే కాకుండా డైలాగ్స్ విషయంలో పాటల విషయంలో స్క్రీన్ ప్లే విషయంలో ఇలా ప్రతి విషయంలోను ప్రత్యేకత కనిపించాలని ‘అల’ తరువాత రాబోతున్న మూవీ కాబట్టి తన అభిమానులకు ఈమూవీ పై విపరీతమైన అంచనాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్లు గా ఈ మూవీ స్క్రిప్ట్ ఉండాలని బన్నీ సుకుమార్ కు పదేపదే చెపుతున్నట్లు సమాచారం. దీనితో విసుగు చెందిన సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ను ఆరు వెర్షన్స్ గా తన సహాయకుల చేత తయారు చేయించి ఆరు బౌండ్ స్క్రిప్ట్ లను బన్నీకి ఇచ్చి ఇందులో అతడికి ఏది నచ్చితే దానికి అనుగుణంగా షూటింగ్ మొదలు పెడతాను అని చెప్పి సుకుమార్ బన్నీకి షాక్ ఇచ్చినట్లు టాక్.

 

సుకుమార్ నుండి ఊహించని ఈ సమాధానానికి షాక్ అయిన బన్నీ ప్రస్తుతం అతడు ఇచ్చిన ఆరు రకరకాల స్క్రిప్ట్ లను చదువుతూ అనవసరంగా సుకుమార్ ను కెలికానా అని మధన పడుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ దర్శకులలో పర్ఫెక్షనిష్ట్ గా పేరు గాంచిన సుకుమార్ ప్రస్తుతం బన్నీతో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ఎంపిక విషయంలో పట్టుపడుతూ దర్శకుడుగా తన రేంజ్ ని పరోక్షంగా బన్నీకి తెలియచేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: