దివంగత నటి.. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు.. బాలీవుడ్ అందాల తార.. జాన్వీ కపూర్ కు కోపం వచ్చింది. ఎప్పుడు కూల్ గా తన పని తానూ చేసుకుపోయే జాన్వీ ఈసారి చాలా సీరియస్ అయ్యింది... అంత సీరియస్ ఎందుకు అనుకుంటున్నారా? ఇంకేందుకు అండి టైటిల్ లో చెప్పగా.. ఆమె దుస్తుల గురించి మీకు ఎందుకు? 

 

ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడు.. ఈమె పొట్టి పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది.. పొట్టి పొట్టి దుస్తులతో ఆమె జిమ్ కి వెళ్లే సమయంలో తీసుకునే ఫోటోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.. అయితే ఆ ఫోటోలపై నెటిజన్లు కూడా ఓ రేంజ్ కామెంట్లు చేస్తున్నారు.. 

 

ఇంకొందరు అయితే.. ఒకప్పుడు ఆమె నటించిన ధడక్ చిత్రం గురించి.. ఆమె నటన గురించి.. ఆమె అందం గురించి మాట్లాడేవారట.. కానీ ఇప్పుడు.. ఆమె జిమ్ కు వేసుకు వెళ్లే పొట్టి దుస్తుల గురించి మాట్లాడుతున్నారట.. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.. 

 

అయితే అక్కడే ఆమె జిమ్ ఫోటోలపై జాన్వీ స్పందించింది.. ''అభిమానులు ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి నా తొలి సినిమా 'ధడక్' గురించి మాట్లాడేవారు. ఆ సినిమా బాగుందని, అందులో నా నటన చాలా బాగుందని చెప్పేవారు. ఇప్పుడేమో నేను జిమ్‌కి వేసుకునే బట్టలు చాలా బాగుంటున్నాయ్ అంటున్నారు. వారు అలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగని వారినేం తప్పు పట్టను. ఎందుకంటే అందరూ అందం, దుస్తుల మీదే దృష్టి పెడతారు. మున్ముందు నేను వేసుకునే పొట్టి దుస్తుల గురించి కాకుండా, నా సినిమాల గురించి మాట్లాడుకుంటారని అనుకుంటున్నా'' అంటూ అందులో చెప్పుకొచ్చింది. 

 

అయితే.. ఆమె ఎంత ఇబ్బంది అని చెప్పిన ఆమె ఫ్యాన్స్ వింటారా? ఏంటి? మళ్ళి మళ్ళి అలాంటి ఫొటోలే ట్రెండ్ చేస్తారు.. అవే ప్రశ్నలు వేస్తారు.. ఆలా చెయ్యకూడదు అంటే.. జాన్వీ పొట్టి దుస్తుల్లో కనిపించకూడదు.. కానీ అది అవ్వదు కదా! 

మరింత సమాచారం తెలుసుకోండి: