తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు అన్నది అక్షరసత్యం. మామూలుగా తెలుగు సినిమా హీరోలలా కాకుండా తమిళ హీరోలు తమ రాష్ట్రంలో జరిగే రాజకీయ వ్యవహారాలపై తరచుగా స్పందిస్తూ ఉంటారు. అయితే వాటి వల్ల వారు అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్నమాట నిజమే. అయితే కొద్ది రోజుల క్రితమే విజయ్ పైన ఐటీ దాడులు జరగడం మరియు అక్కడి నుండి 65 కోట్ల రూపాయల నగదు మరియు మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే డాక్యుమెంట్స్ ను ఆదాయ పన్ను శాఖ వారు సీజ్ చేశారు. దేశంలో ఎక్కడ రైడ్ జరిగినా దానితో బిజెపికి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉంటుంది అన్నది అందరి భావన.

 

అయితే విజయ్ ప్రస్తుతం దేశాన్ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న సీఏఏ చట్టాన్ని తాను కూడా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన కొద్దిరోజులకే ఐటి దాడి జరగడం అందరిలో ఇప్పుడు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అదీ కాకుండా విజయ్ రాజకీయాల్లోకి రావాలని అతని ఫ్యాన్స్ అందరూ విపరీతంగా ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో నిమ్న వర్గానికి చెందిన విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడితే…. తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుంది అని పలు రాజకీయ పార్టీలు భావించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఐటీ దాడులు అని కూడా పలువురు చెబుతున్నారు.

 

ఇక నిన్న జరిగిన విషయానికి వస్తే విజయ్ తదుపరి చిత్రం అయిన 'మాస్టర్' షూటింగ్ నేవెలి వద్ద జరుగుతుండగా కొందరు బిజెపి మద్దతు దారులు అక్కడికి వచ్చి షూటింగ్ ను నిలిపి వేయాలంటూ నానా రభస చేశారు. తమ ఇళయదళపతి విజయ్ సినిమా షూటింగ్ ను ఆపేసినట్లు తెలిసుకున్న విజయ్ ఫ్యాన్స్ అక్కడికి రాగా అది కాస్తా పెద్ద రచ్చ అయింది. షూటింగ్ బొగ్గు మైనింగ్ ఏరియాలో జరుగుతుండగా అది వాణిజ్యపరమైన కార్యకలాపాలు జరిపేందుకు నిషిద్ధమైన ప్రదేశమని బిజెపి వారి వాదన. అయితే చివరికి పోలీసులు కలుగజేసుకొని టైట్ సెక్యూరిటీ ద్వారా షూటింగ్ ను కొనసాగించారు. ఏదేమైనా విజయ్ పై రాజకీయపరంగా పెద్ద కుట్ర జరుగుతున్నట్లు అందరూ బలమైన నిర్ణయానికి వచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: