యాంకర్ రవి.. తెలియని వారు ఉండరు.. బుల్లితెరపై ఈయన చేసే కామెడీ ఏ వేరు.. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ రవి ఎన్నో షోలు చేశాడు.. ఎందరో ప్రేక్షకులను అలరించాడు... యాంకర్ లాస్య, శ్రీముఖిపై సెటైర్లు వేసి వేసి మరింత టాప్ ఎదిగాడు.. చెప్పాలంటే యాంకర్ రవిపై చాలా రూమర్స్ కూడా ఉన్నాయి అనుకోండి.. 

              

అలాంటి రవి.. బుల్లితెరపై కొన్ని షోస్ చేసుకుంటూ.. అప్పుడప్పుడు సినిమాల్లో హీరోగా మెరుస్తూ జీవనం ఆలా కొనసాగిస్తున్నాడు. అలాంటి యాంకర్ రవి అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ ని కూడా చూసొస్తుంటాడు.. ఈ నేపథ్యంలోనే యాంకర్ రవి నిన్న మరోసారి పోలీస్ స్టేషన్ తలుపు తట్టొచ్చాడు.. 

                     

ఎందుకు తట్టాడు అంటే.. ఓ వ్యక్తి యాంకర్ రవిని ఘోరాతి ఘోరంగా మోసం చేశాడట.. బెదిరిస్తున్నాడట.. ఎక్కడికి వెళ్లిన అతని మనుషులను వెనుక పంపిస్తున్నాడట. దీంతో యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించాడట.. కొంచం ఆశ్చర్య కరంగా ఉన్న.. ఇది నిజం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన సందీప్ అనే వ్యక్తి అతన్ని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు యాంకర్ రవి.

 

 

సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో సందీప్ అనే వ్యక్తి 45 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశాడని, 45 లక్షలు అప్పుగా తీసుకున్న సందీప్ కొన్ని రోజుల తర్వాత కొంత డబ్బులు ఇచ్చాడని.. అయితే మిగతా డబ్బులు ఇవ్వాలని అడగ్గా బెదిరిస్తున్నాడని, అంతేకాదు.. తాను ఎక్కడికెళ్లినా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పంపి బెదిరిస్తున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: