టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలకు కొదవ లేదు. సాధారణంగా తండ్రికి కొడుకు మీద కంటే కూతురి మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం అలాగే తల్లికి కూతురి మీద కంటే కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. మరి మన టాలీవుడ్ లో కొన్నిసార్లు తండ్రులను పబ్లిక్‌గా ధిక్కరించిన కూతుర్లు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. సామాన్య ప్రజలకు ఇవి మామూలే అయినా సెలబ్రెటీల విషయానికి వచ్చేసరికి కొంచం స్పెషల్‌గా చూస్తారు. టాలీవుడ్లో తండ్రులను విమర్శించిన ఆ కూతుర్లు ఎవరో చూద్దాం. ముందుగా సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి తీసుకుంటే...
ఈయన పేరు చెబితే కన్న కూతురేంటి కట్టుకున్న భార్య ఏంటి ఎవ్వరైనా సరే విభేదించకుండా ఉండరు. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పవర్కళ్యాణ్కి వీరాభిమాని అయిన వర్మ కూతురు పవన్ పై ఒక్క మాట కూడా పవనివ్వదు. కానీ వర్మ మాత్రం పని గట్టుకుని పవన్‌ని మెగా ఫ్యామిలీని ఏకి పారేస్తూ ఉంటాడు. నువ్వు ఎలాగైనా ఉండు మా పవన్ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ తండ్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది వర్మ కూతురు.
ఇక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తన చిన్న కూతురు శ్రీజ ఇంట్లో ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాకు నా భర్తకి నా ఫ్యామిలీ నుంచి థ్రెట్ ఉంది అంటూ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ చిరంజీవి మళ్ళీ తన కూతురిని అక్కున చేర్చుకుని రెండవ పెళ్ళి చేశారు. దాంతో కొన్నాళ్ళకే మా నాన్న బంగారం అంటూ కుటుంబంతో కలిసి పోయింది.
ఇక నా తండ్రి వల్లే నాకు ప్రాణ హాని ఉందని అలాగే నేను ఒక డబ్బు సంపాదించే మిషన్ లాగా చూస్తున్నారని గతంలో ఆర్తిఅగర్వాల్ తన తండ్రి గురించి మీడియాకు ఎక్కి రచ్చ చేసింది. అంతేకాక ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. కెరియర్ పీక్‌లో ఉండగా కూతురు ఎక్కడ పెళ్ళి చేసుకుంటుందో అని ఆ తండ్రి కూతుర్ని కంట్రోల్ చేయబోయాడు. ఒకానొక సందర్భంలో మెట్ల పైనుంచి దూకబోయి తలకు తీవ్ర గాయాలు కూడా చేసుకుంది ఆర్తి. ఏది ఏమైనా ఇంత పెద్ద నటి మన మధ్య లేకపోవడం తీరని లోటనే చెప్పాలి.
ఇక నా తండ్రి పెద్ద తాగుబోతు డ్రగ్స్ వాడుతుంటారు. నా తల్లికి మందు అలవాటు చేశాడు. మత్తులో ఆస్తులన్నీ రాయించుకుని నాకు అన్యాయం చేశాడు అంటూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది వనిత విజయ్‌కుమార్. ఇక ఆ ఆరోపణల్లో ఎన్ని నిజాలు ఉన్నాయో. ఎన్ని ఆబద్ధాలు ఉన్నాయో ఆమెకైనా తెలుసో తెలీదో మరి. చివరికి వనిత లాంటి ఆడపిల్ల చేతిలో పెరిగితే ఆమె కొడుకు పనికిరాకుండాపోతాడని కోర్టు ఆ పిల్లాడి కస్టడీని విజయ్‌కుమార్‌కి ఇచ్చిందంటే మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ తండ్రీ కూతుర్ల బంధం గురించి.