ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హేగ్డే జంటగా తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ మూవీ మొదటి నుంచి భారీ అంచనాలతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో మరో ప్రత్యేకత ఏంటంటే రిలీజ్ కి ముందే థమన్ సంగీతం అందించిన సామజవర గమన, రాములో రాములా సాంగ్స్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించాయి. అయితే అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ మూవీ డిజాస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు.  మంచి కథ కోసం ఆయన వెయిట్ చేస్తున్నానని.. అభిమానులు ఎంత తొందర పెట్టిన.. త్వరలో మీ ముందుకు వస్తాను బ్రదర్ అంటూ తప్పించుకునేవారు.  మొత్తానికి తనకు గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురములో’ మూవీలో నటించి.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. 


మూవీ నాన్ బాహుబలి రికార్డులు సైతం బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు మంచి స్నేహ పూర్వకంగా ఉంటున్న విషయం తెలిసిందే.  గతంలో అల్లు అర్జున్ కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ అల వైకుంఠపురంలో సినిమా విడుదలకు ముందు రౌడీ బ్రాండ్ టి షార్ట్స్ ని అల్లు అర్జున్ కి గిఫ్ట్ గా పంపగా.. వాటిని వేసుకుంటా అని అల్లు అర్జున్ చెప్పాడు.  గతంలో ఓ ఈవెంట్ లో కూడా తనకు విజయ్ వేసుకును డ్రెస్సులు చాలా ట్రెండింగ్.. ఫ్యాషన్ గా ఉంటాయని అని తెగ పొగిడిన విషయం తెలిసిందే. విజయ్ ఇచ్చిన రౌడీ టీ షార్ట్స్ ని అల్లు అర్జున్ తిరుపతి నుండి వచ్చేటప్పుడు వేసుకున్నాడు. అలాగే అల్లు అర్జున్ తల మీద క్యాప్ కూడా అల్లు అర్జున్ నెక్స్ట్ చెయ్యబోయే సినిమా పేరు ఆ క్యాప్ మీద ఉంది.


 వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ చెయ్యబోయే ఐకాన్ సినిమా పేరు అల్లు అర్జున్ క్యాప్ మీద ఉండటంతో తన తదుపరి సినిమా ఈ దర్శకుడితో అని కన్ఫాప్ అవుతున్నట్లు చెప్పకనే చెబుతున్నారు బన్నీ.  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో తీస్తున్న విషయం తెలిసిందే. అయితే  శ్రీరామ్ తో చెయ్యాల్సిన సినిమా ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం ఐకాన్ క్యాప్ పెట్టుకుని తిరుగుతూ అందరికి ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: