త్రివిక్రమ్.. ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండడు. ఎందుకంటే త్రివిక్రమ్ అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి.. అతను డైలాగ్ రాశాడు అంటే? ఎవరైనా సరే అబ్బా ఏముంది అనాల్సిందే.. త్రివిక్రమ్ తీసే ప్రతి సినిమాలో అద్భుతమైన డైలాగులు.. మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే సన్నివేశాలు.. కథ కామన్ అయినప్పటికీ ఇంకా ఇంకా చూడాలి అనిపించే సీన్స్ చాలానే ఉంటాయి.      

 

అయితే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ పై కాఫీ రైట్స్ పడిన.. మొన్న అల వైకుంఠపురములో సినిమాతో సంక్రాంతి సూపర్ డూపర్ రికార్డు సొంతం చేసుకుని ఆ మరకను కూడా తొలిగించుకున్నాడు. అయితే అంతటి స్టార్ డైరెక్టర్ భార్య గురించి మీకు తెలుసా? ఆమె ఎవరి కూతురు తెలుసా?       

 

ఆమె ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత‌, ప‌ద్మ‌శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సోద‌రుడు కూతురు. ఆమె పేరు సౌజన్య.. ఆమె టాలెంట్ ముందు చెప్పాలంటే త్రివిక్రమ్ టాలెంట్ కూడా పనికిరాదు. అంతటి తెలివైన వ్యక్తి సౌజన్య. ఆమె ఒక నాట్యకళాకారిని.. ఇండస్ట్రీకి వచ్చి సంవత్సరాలు గడిచిన ఈ విషయం రెండు సంవత్సరాల క్రితమే వెలుగులోకి వచ్చింది. 

 

2018లో త్రివిక్రమ్ భార్య అయినా సౌజన్య రవీంద్ర భారతిలో భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇచ్చింది. అప్పటి వరుకు ఎక్కడ ఎవరికి కనిపించని త్రివిక్రమ్ భార్యలో ఇంత గొప్ప టాలెంట్ ఉందా అంటూ పలువురు ఆశ్చర్య పోయారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. అప్పట్లో ఆమె నాట్యం కొద్దిరోజులు పాటు మీడియాలో నాట్యం చేసిందంటే నమ్మరు. కాగా 2002లో త్రివిక్రమ్ సౌజన్యను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంత స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఆమె ఎక్కువగా బయటకు రారు. చెప్పాలంటే అసలు కనిపించరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: