తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమెరుగని దర్శకులుగా ప్రస్థానం కొనసాగిస్తున్న వారిలో ఒకరుగా ఉన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరెట్ డైరెక్టర్గా మారిపోయాడు. అనిల్ రావిపూడి సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ పెరిగిపోయింది. అనిల్ రావిపూడి సినిమా అంటే హిట్టు  గ్యారంటీ అనే భావన అటు హీరోల్లో కూడా కలిగింది. ఇంతకీ అనిల్ రావిపూడి తక్కువ కాలంలోనే ఇంత క్రేజ్ సంపాదించడానికి గల కారణం ఏమిటి...?  అసలు తెలుగు ప్రేక్షకుల్లో  అనిల్ రావిపూడి కి ఇంత క్రేజ్ ఎందుకు పెరిగింది..?  అసలు అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఉన్న  స్పెషాలిటీ ఏమిటి..? ఇవన్నీ ప్రస్తుతం చాలా మంది లో ఉన్న ప్రశ్నలు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్  ఉన్నప్పటికీ అనిల్ రావిపూడి కి ఇంత క్రేజ్ ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

 


 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ యాక్షన్ సినిమాలు... లవ్ స్టోరీలు... బూతు సినిమాలు... వీటన్నింటికీ ఎక్కడ కొదవలేదు. ఎప్పుడు ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచే  సినిమాలు మాత్రం అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు వచ్చాయి అంటే ప్రేక్షకులు ఆ సినిమాకు భారీ విజయాన్ని కట్టబెడతారు. ఇక ఇప్పుడు ప్రేక్షకుల ధోరణి కూడా మారిపోయింది. సినిమాలకు వెళ్లి లవ్ సెంటిమెంట్ తో ఫీల్ అవ్వడమో... లేదా భారీ యాక్షన్ సీన్లలో హీరోలు విలన్లను  ఊచ కోత కోస్తుంటే చూసి ఇబ్బందిగా ఫీల్ అవ్వటమో ... లాంటివి అస్సలు ఇష్టపడడం లేదు... సినిమాకు వెల్లామా... కడుపుబ్బ నవ్వుకున్నామా  ఆ తర్వాత ఎంతో హ్యపీ గా ఇంటికి వచ్చామ... ఇలా మారిపోయింది ప్రస్తుతం ప్రేక్షకులు ధోరణి. 

 

 ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో లేని సరికొత్త కామెడీతో పటాస్  సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు ప్రేక్షకుల పల్స్ ని సరిగ్గా తెలుసుకుని సరైన కామెడీ ఎంటర్టైనర్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేసి కడుపుబ్బా నవ్వు కొని హాయిగా ఇంటికి వెళ్లేలా సినిమాలు  తెరకెక్కించాడు. దీంతో అనిల్ రావిపూడి కి ఎన్నో  విజయాలు వచ్చిపడ్డాయి. ప్రేక్షకులు ప్రస్తుత జనరేషన్ లో ఎలాంటి సినిమాలోది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి సినిమాలను తెరకెక్కించి... తన సినిమాల్లో ఆక్షన్ కి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కామెడీ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. అదే సమయంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా సరైన పాళ్లలో దట్టిస్తూ ... సినిమాలను తెరకెక్కించి సంచలన విజయాలను అందుకుంటున్నాడు. అందుకే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో  అనిల్ రావిపూడి ఇంత క్రేజ్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: