గతంలో ఓ హీరో సినిమా చేస్తే నిర్మాత ఆయనకు నెలవారీ శాలరీ కింద రెమ్యునరేషన్ ఇచ్చేవారు. తర్వాత రోజుల్లో రెమ్యునరేషన్ లెక్కలు మారిపోయి సినిమాకు ఇంత.. అని టోటల్ అమౌంట్ తీసుకునేవారు. తర్వాత రోజుల్లో రెమ్యునరేషన్ తో పాటు సినిమా హిట్ అయితే లాభాల్లో కొంత వాటాలు కూడా ఇచ్చేవారు. అయితే ఈ సిస్టంను టాలీవుడ్ లో పూర్తిగా మార్చేసింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. సినిమా రెమ్యునరేషన్ తో పాటు ఏరియా రైట్స్ కూడా తీసుకోవడం చిరంజీవితో ప్రారంభమైంది. 1992లో వచ్చిన ఘరానామొగుడు సినిమా నుంచి చిరంజీవి ఇలా ప్లాన్ చేసుకున్నాడు.

 

 

ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ టాలీవుడ్ హీరోలు కూడా ఇదే పద్ధతిని ఇంకొంచెం వినూత్నంగా ఫాలో అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసే మహేశ్ బాబు పారితోషికం కింద లాభాల్లో వాటాలు తీసుకుంటున్నాడు. అడ్వాన్సుగా అమౌంట్ తీసుకుంటున్నప్పటికీ అదంతా బిజినెస్ జరిగాక నిర్మాతకు వచ్చే లాభాల్లోంచి మాత్రమే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడిదే పద్ధతిని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఫాలో అవుతున్నాడని టాక్. వరుసగా సినిమాలు కమిట్ అవుతూ సినిమాలు చేస్తూండడంతో ఆయన రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్ జరిగాక వచ్చే లాభాల్లోంచి మాత్రమే రెమ్యునరేషన్ అమౌంట్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఇదే విధానాన్ని స్టార్ హీరోలందరూ ఫాలో అవుతున్నారని అంటున్నారు.

 

 

నిజానికి ఇలాంటి పద్ధతిని మొదటగా పాటించింది బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ బచ్చన్. అటు నుంచి చిరంజీవి.. తర్వత రజినీకాంత్ ఇలా తమ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. 1992లో ఘరానామొగుడు సినిమాకు చిరంజీవి తీసుకున్న 1.25కోట్ల రెమ్యునరేషన్ ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్. దీనిపై అప్పట్లో ‘ది వీక్’ పత్రిక ముఖ చిత్రంలో ‘Bigger than Bachan’ అని ప్రచురించింది కూడా. ప్రస్తుతం పవన్, మహేశ్ ఇదే ఫాలో అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: