యంగ్ హీరో శర్వానంద్ ,స్టార్ హీరోయిన్  సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ జాను ఇటీవల విడుదలై  పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకున్నా కూడా  బాక్సాఫీస్ వద్ద  ఆశించిన స్థాయిలో వసూళ్లను  రాబట్టలేకపోతుంది. మూడో రోజు కూడా  కలెక్షన్స్ లో గ్రోత్ లేకుండా సాధారణ వసూళ్లను రాబట్టి నిరాశపరిచింది. మూడో రోజు ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1.55కోట్ల వసూళ్లను రాబట్టి  మూడు రోజుల్లో 5.40కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మరో 10కోట్లు రాబడితేకాని రెండు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కాదు అయితే ఫుల్ రన్ లో మరో 5కోట్లు రాబడితే గొప్పే దాంతో ఈ చిత్రంతో   బయ్యర్ల కు   భారీ నష్టాలు తప్పలాలేవు.
 
ఇదిలావుంటే ఓవర్సీస్ లో ఈచిత్రం డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. కేవలం అక్కడ మూడు రోజుల్లో 160k డాలర్ల ను మాత్రమే  రాబట్టి తీవ్రంగా నిరాశపరిచింది. కోలీవుడ్  సూపర్ హిట్ కల్ట్ మూవీ  '96' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి  ఒరిజినల్ వెర్షన్ ను  డైరెక్టర్ చేసిన ప్రేమ్  కుమారే  దర్శకుడు కాగా  గోవింద్ వసంత  సంగీతం అందించాడు. 
 
తెలుగు రాష్ట్రాల్లో జాను మూడో రోజు వసూళ్ల వివరాలు : 
 
నైజాం - 59 లక్షలు 
సీడెడ్ - 18లక్షలు  
ఉత్తరాంద్ర - 28లక్షలు 
గుంటూరు - 12లక్షలు 
తూర్పు గోదావరి - 10లక్షలు  
పశ్చిమ గోదావరి - 9లక్షలు 
కృష్ణా - 13.2 లక్షలు 
నెల్లూరు - 6లక్షలు 
మూడో రోజు కలెక్షన్లు  మొత్తం  = 1.55కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: