సినిమా అనే రంగుల ప్రపంచం అంటే అందరు చాల అందమైనది అని అనుకుంటారు. కానీ ఈ ప్రపంచం ముళ్ళతో కూడుకున్నది అని అందులో అడుగుపెట్టిన వారికీ మాత్రమే తెలుస్తుంది. మ‌రియు ఈ రంగంలోకి అడుగు పెట్ట‌డం ఎంత క‌ష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలానే కొర‌టాల శివ కూడా ఎన్నో క‌ష్టాలు ప‌డి సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన సంగ‌తి అందిరికి తెలిసిందే. అయితే మ‌న‌కు తెలియ‌ని విష‌యాలు ఆయ‌న లైఫ్‌లో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. కొర‌టాల శివ‌.. 1975 జూన్ 15న గుంటూరు జిల్లా పెదకాకాని లో కమ్యూనిస్ట్ భావజాలం గల ఓ మధ్యతరగతి కుటుంబంలో రెండో సంతానంగా జన్మించాడు. 

 

అయితే శివకు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. దీంతో తండ్రి ఉద్యోగం తల్లికి వచ్చింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ త‌ల్లి క‌ష్టంతో బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు.  కథలు రాయడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఈయ‌న. అలా ఐదేళ్లు కష్టపడి మంచి రైటర్ గా రాటుదేలాడు. ఈ క్ర‌మంలోనే రవితేజ భద్ర సినిమాకు రచయితగా కథ అందించాడు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం మరియు ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. ఇక 2011వరకూ సహాయ రచయితగా ఉన్న శివ‌.. 2013లో మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. 

 

ప్రభాస్ హీరోగా వచ్చిన ఆ సినిమా హిట్ అవ్వడంతోనే తొలిచిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కాని ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే..  మిర్చి సినిమా రెండు రోజుల్లో విడుదల అవుతుందనగా తల్లి చనిపోయింది. దాంతో అప్పట్లో విషాదం అలుముకుంది. ఇక ఇక 2015 లో మహేష్ బాబుతో తీసిన శ్రీమంతుడు మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ త‌ర్వాత  జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వ‌రుస హిట్ల‌తో స్టార్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నారు. ఉత్తమ డైరెక్టర్ గా కొరటాల శివకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా ద‌క్కించుకుని ప్ర‌స్తుతం మంచి జోరు మీద ఉన్నాడు. మ‌రోవైపు అరవింద అనే అమ్మాయిని ప్రేమించడం,ఆమె లండన్ వెళ్లి వచ్చాక పెళ్లిచేసుకోవడం జరిగాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: