నేచురల్ స్టార్ నాని ,శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కనున్న రెండో చిత్రం టక్ జగదీశ్..  ఇటీవలే  అధికారికంగా లాంచ్ కాగా  ఈ చిత్రం రేపటి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. అందులో భాగంగా రేపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్  పొల్లాచి లో స్టార్ట్ కానుంది. అయితే ఇంకా షూటింగ్ కూడా కూడా స్టార్ట్ కాక ముందే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు అమ్ముడయ్యాయి. 3.5కోట్లకు ఈ సినిమా హక్కులను వీకెండ్ సినిమాస్ దక్కించుకుంది. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ ,తమిళ  నటి ఐశ్వర్య రాజేష్  కథానాయికలుగా నటించనున్న ఈ చిత్రానికి  థమన్  సంగీతం అందిస్తుండగా  షైన్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై  సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. జులై 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక గతంలో నాని ,శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన నిన్ను కోరి సూపర్ హిట్ కావడం తో  మళ్ళీ ఇదే కాంబో లో వస్తున్న టక్ జగదీష్ పై  మంచి అంచనాలు వున్నాయి.  
 
ఇక నాని  ఈ సినిమా కన్నా ముందు తన 25వ చిత్రం వి తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  సుధీర్ బాబు మరో హీరోగా నటించగా  నాని విలన్ గా కనిపించనున్నాడు.  మోహన్ కృష్ణ krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నివేధ థామస్ , అధితి రావ్ హైదరి కథానాయికలు గా నటించగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మార్చి 25న ఈ సినిమా విడుదలకానుండగా అతి త్వరలో టీజర్ రిలీజ్ కానుంది.  ఇదిలావుంటే టక్ జగదీష్ తోపాటు నాని మరో సినిమాను లైన్లో పెట్టాడని సమాచారం. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ డైరెక్షన్ లో నాని నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈసినిమా గురించి  అధికారిక ప్రకటన వెలుబడనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: