అనిల్ రావిపూడి.. తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.. ప్రస్తుతం యాంగ్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడిది స్టార్ డైరెక్టర్ పొజిషన్. అయన చేసిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి.. కమర్షియల్ మీటర్ తెలిసిన దర్శకుడిగా అనిల్ రావిపూడికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. చేసిన ఐదు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. 

 

దర్శకుడిగా అనిల్ రావిపూడి ప్రతి సినిమాకు ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకు వెళ్ళాడు. తన మొదటి 'పటాస్'ను చాలా తక్కువ బడ్జెట్ లో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించాడు. అది సూపర్ హిట్ అయింది. రెండో సినిమా 'సుప్రీమ్'కు మరో మెట్టు ఎక్కి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించాడు. అది కూడా సూపర్ హిట్టే. 

 

ఇక మూడో సినిమా రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్'. ఈ సినిమా ఫలితం కూడా తెలిసిందే. నాలుగో సినిమా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్ 2'... ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఐదో సినిమా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ లో తీసాడు. అదే 'సరిలేరు నీకెవ్వరు'... ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. 

 

ఈయన తీసిని ప్రతి సినిమా హిట్ట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అందరూ అనుకుంటున్నారు.. అనిల్ రావిపూడి కామెడీ చిత్రాలు తిస్తె ప్రజలు చూస్తారు అని.. అందుకే అనిల్ రావిపూడి ప్రజలు పూల్స్ పట్టుకొని సినిమాలు తీస్తున్నాడు అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ వెనుక రాజేంద్ర ప్రసాద్ ఉన్నారట. 

 

నిజానికి.. ఆయనకు రాజేంద్ర ప్రసాద్ కు ఏలాంటి సంబంధం లేదు.. కానీ రాజేంద్ర ప్రసాద్ అంటే అనిల్ రావిపూడి ఎంతో ఇష్టమట.. అందుకే అనిల్ రావిపూడి అలాంటి కామెడీ చిత్రాలు తీస్తున్నడట.. అప్పట్లో అందరూ హీరోల సినిమాలు యేవో ఒక్కటి అయినా ప్లాప్ అయ్యేవి అట.. కానీ రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అన్ని.. మ్యాక్సిమం సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయట.. కారణం కామెడీ.. అయన చిత్రాలలో కామెడీ ఎక్కువగా ఉండటం వల్లే అయన సినిమాలు హిట్ అయ్యాయి.. ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. అందుకే ఈయన తీసే ప్రతి చిత్రం మ్యాక్సిమం కామెడీ ఉండేలా చేసుకుంటాడట అనిల్ రావిపూడి.  

మరింత సమాచారం తెలుసుకోండి: