కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ మద్య తెలుగు లో కూడా మంచి విజయాలు అందుకుంటున్నారు.  నటుడు, దర్శకుడు, నిర్మాత, సింగర్ గా తన సత్తా చాటుతున్న ధనుష్ ఇటీవల అసురన్ సినిమాతో రూ.150 కోట్ల క్లబ్ లో చేరారు.  ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అయిన పటాస్ మూవీ తెలుగు లో లోకల్ బాయ్ గా రిలీజ్ చేయబోతున్నారు.  దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ధనుష్ తన సత్తా చాటుతున్నారు.  తాజాగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక మూవీ తెరకెక్కిస్తున్నారు.

 

భిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. అయితే కార్తీక్ సుబ్బరాజ్ కి తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.  రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ గా ఈ సినిమాలో ధనుశ్ కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది. గతంలో గ్యాంగ్ స్టర్ తరహా సినిమా మారీ, మారి 2 మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.

 

కాగా, ఈ నెల 19వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను, మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో అటువైపు తిరిగి కత్తి పట్టుకొని ఉన్న పోస్టర్ చూస్తుంటే ఈ మూవీ మరో యాక్షన్ తరహాలో రూపొందుతున్నట్లు అర్థం అవుతుంది.  మరీ  ఈ మూవీతో ధనుష్ ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో అని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.  తమిళనాట సూపర్ స్టార్ అల్లుడు అయిన ధనుష్ ఆ క్రేజ్ ఏమాత్రం ఉపయోగించకుండా.. తన సొంతంగా కష్టపడుతూ మంచి ఇమేజ్ సంపాదిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: