పండుగ వచ్చిందంటే సినీ అభిమానులకు సండేదే సందడి. పండగల సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. అయితే ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు పోటా పోటీగా నిలుస్తూ కాసుల వర్షం కురిపించాయి. ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీసుకు నిజమైన పండగ తీసుకొచ్చిందనేది వాస్తవం. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రావడంతో ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించారు.  భారీ కలెక్షన్స్ నమోదు చేసి సందడి తీసుకొచ్చారు.

 

సంక్రాంతి తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో మాస్ మహారాజా 'డిస్కోరాజా'.  నాగశౌర్య  కొత్త సినిమా 'అశ్వథ్థామ' సినిమాలు చెప్పుకోదగ్గవి. ఈ సినిమాల ఫలితం అందరికీ తెలిసిందే. ఇక వీటితో పాటు పలు స్మాల్ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి కానీ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 

ఫిబ్రవరిలో విడుదల అయిన సినిమాల పరిస్థితి కూడా మహా నీరసంగా ఉంది. సమంతా-శర్వానంద్ లు నటించిన 'జాను' కలెక్షన్స్ చూస్తుంటే హిట్ దిశగా పయనించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ సినిమాతో పాటుగా రిలీజ్ అయిన చిన్న సినిమాలు 'సవారి'.. '3 మంకీస్' లాంటి సినిమాలకు కూడా పెద్దగా స్పందన దక్కలేదు.

 

ఇప్పటి వరకూ రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క సినిమా కూడా మంచి కలెక్షన్స్ నమోదు చెయ్యలేకపోయింది.  నిజానికి ఫిబ్రవరి మార్చ్ నెలలను టాలీవుడ్ కు అన్ సీజన్ గా పరిగణిస్తారు. పరిక్షల సమయం దగ్గరపడడంతో సినిమాలకు యూత్ కాస్త దూరంగా ఉంటుంది.

 

ఈ నెలలో రిలీజ్ కానున్న కొత్త సినిమాలపై ట్రేడ్ లో ఆసక్తి నెలకొంది. వాటిలో ముఖ్యంగా తెలంగాణా మెగా స్టార్.. తెలంగాణా పవర్ స్టార్ ల పైనే ఆశలన్నీ ఉన్నాయి. ఒకరు విజయ్ దేవరకొండ.. మరొకరు నితిన్. ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీసుకు సందడి తీసుకొస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: