మొదట బుల్లితెరపై ఒక సీరియల్ కు దర్శకత్వం వహించిన రాజమౌళి, ఆ తరువాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. అయితే ఆయన టాలీవుడ్ లో దర్శకత్వం వహించిన తొలి సినిమానే మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ, మర్యాద రామన్న, సై, చత్రపతి, విక్రమార్కుడు ఇలా వరుసగా మొన్నటి బాహుబలి 2 వరకు ప్రతి ఒక్క సినిమాతో ఒక్కో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు, ఆయా సినిమాల ద్వారా ఒక్కొక్క మెట్టు దర్శకుడిగా పైకి ఎదుగుతూ దూసుకెళ్తున్న రాజమౌళి సక్సెస్ ఫార్ములా ఏంటి అని అడిగితే, 

 

ఆయన సన్నిహితులు చెప్పే మాట ఒక్కటే. అనుక్షణం అలానే ఎల్లప్పుడూ కేవలం తాను తీసే సినిమా గురించి మాత్రమే ఆలోచించే రాజమౌళి, సినిమాని మొదలెట్టిన తరువాత తీసే దాదాపుగా అన్ని సీన్లను ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవడం తో పాటు, దానిని తన సినిమాకు పని చేస్తున్న లైట్ బాయ్ దగ్గరనుంచి నిర్మాత వరకు ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఫీల్ అవుతారు అంటూ వారి నుండి ఇన్పుట్స్ తీసుకుని, అలానే తాను కూడా ఒక సాధారణ ప్రేక్షకుడు వలె భావించి తన సినిమాకు సంబంధించిన సన్నివేశాలు మరింత జాగ్రత్తగా తీయడం పై దృష్టి పెడతాడట. ఇక ఒక సినిమా తీయడంలో నిమగ్నమైన రాజమౌళి

 

అది పూర్తి అయి థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు మరొక దాని పై ఏమాత్రం దృష్టి పెట్టరని, ఇవే ఆయన ఆయన సక్సెస్ కు ముఖ్య కారణాలని, అందుకే ఆయన తీసే ప్రతి ఒక్క సినిమా ఒకదాన్ని మించి మరొకటి ఎంతో గొప్ప విజయాలు అందుకుంటూ టాలీవుడ్ దర్శకులు అందరిలో ఆయనకు రాజాధిరాజు గా కీర్తి ప్రతిష్టలు తీసుకోవచ్చా అని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా తీస్తున్న రాజమౌళి, తప్పకుండా ఆ సినిమాతో దర్శకుడిగా మరొక్క మెట్టు ఎక్కుతారనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: