పాన్ ఇండియన్ సినిమా అనగానేే, టాలీవుడ్ మేకర్స్ అంతా బాలీవుడ్ ఆర్టిస్టులను దింపుతుంటారు. హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ముంబయి నుంచి తీసుకొస్తుంటారు. కానీ పరిస్థితులను మార్చేస్తోంది ఓ మాజీ హీరోయిన్. సౌత్ స్టార్డమ్ తోనే నార్త్ కు వెళ్తోంది శివగామి. 

 

పాన్ ఇండియన్ మూవీ అంటూ సాహో సినిమా కోసం బాలీవుడ్ ఆర్టిస్టులను భారీగా తీసుకొచ్చారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం జాకీష్రాఫ్, మందిరాబేడీ లాంటి నార్త్ ఆర్టిస్టులను పట్టుకొచ్చారు. కానీ ఇప్పుడీ నార్త్ ఫార్ములాను పెద్దగా పట్టించుకోవట్లేదు దర్శకులు. నార్త్ లోనూ గుర్తింపున్న దక్షిణాది ఆర్టిస్టులతోనే పాన్ ఇండియన్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. 

 

పూరీ జగన్నాథ్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఓ మల్టీ లింగ్వల్ మూవీ చేస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ఓ యాక్షన్ డ్రామా డైరెక్ట్ చేస్తున్నాడు. కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ మూవీలో అనన్యాపాండేని హీరోయిన్ గా తీసుకున్నారు. హీరో అమ్మ పాత్రకు రమ్యకృష్ణను అప్రోచ్ అయ్యాడు పూరీ. 

 

వరుణ్ తేజ్ గీతా ఆర్ట్స్ లో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాడు. మల్టీ లింగ్వల్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కూడా వరుణ్ అమ్మ పాత్రకు రమ్యకృష్ణను తీసుకుంటున్నారు. మరి మల్టీలింగ్వల్ సినిమాలు పోటీపడి మరీ రమ్యకృష్ణను తీసుకోవడానికి బాహుబలి ఓ కారణమని చెప్పొచ్చు. శివగామిగా నార్త్ లోనూ సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అందుకే మల్టీలింగ్వల్ మూవీకి రమ్య స్టార్డమ్ ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు దర్శకులు. 

 

మొత్తానికి రమ్యకృష్ణ బాహుబలి సినిమాతో పాపులర్ అయిపోయింది. ఆమె క్యారెక్టర్ మూవీకే హైలెట్ గా నిలవడంతో ఇపుడు భారత చిత్ర పరిశ్రమ దృష్టి ఆమెపై పడింది. రమ్యకృష్ణను తమ సినిమాల్లో నటించేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీంతో రమ్య కృష్ణ క్రేజీ యాక్టర్ అయిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: