టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటి వరకు క్రికెట్ గ్రౌండ్‌లో సందడి చేసిన భజ్జీ ఇక సిల్వర్ స్క్రీన్‌పై మెరవనున్నారు. ఆఫ్ స్పిన్నర్ గా బంతిని సుడులు తిప్పుతూ ప్రత్యర్థులను హడలెత్తించిన ఈ పంజాబ్ యోధుడు ఇప్పుడు సినీ హీరోగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాడు.  షండో స్టూడియో అండ్‌ సినిమాస్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తమిళ మూవీలో హర్భజన్‌సింగ్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి జేపీఆర్‌-శ్యామ్‌ సూర్యలు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరు దర్శకులు అగ్నిదేవి అనే మూవీ తెరకెక్కించారు.

 

హర్భజన్‌సింగ్‌ హీరోగా నటిస్తున్నఈ మూవీకి  ‘ఫ్రెండ్‌షిప్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించిన విషయం తెలిసిందే. క్రికెట్ మైదానంలో హర్భజన్ కి ఓ ప్రత్యేకత ఉంది.. ఆయన బౌలింగ్ లో ఎన్నో వికెట్స్ తీసుకున్నారు.  అయితే టీమిండియాల్ షార్ట్ టెంపర్ ఉన్న క్రికెటర్లలో హర్భజన్ సింగ్ ఒకరు.  గతంలో ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పై చేయి చేసుకోవడం.. సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇక మూవీ విషయానికి వస్తే ఇద్దరు ఖైదీలకు సంబంధించిన కథాంశంతో కూడిన సినిమా అని అంచనాకు వస్తున్నారు. ఈ మూవీ సమ్మర్‌ స్పెషల్‌గా భారతీయ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.

 

ఈ మూవీలో నటించే ఇతర నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. శ్రీలంకకు చెందిన లోస్లియా మరియనేసన్ ఈ మూవీలో హీరోయిన్. జేపీఆర్, స్టాలిన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాను హిందీ, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.  కాగా, పంజాబీ, హిందీ సినిమాల్లో నటించిన నటీ గీతా బస్రాను భజ్జీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  గీతాబస్రా నటించిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్' సినిమాలో హర్భజన్ సింగ్ కీలక పాత్ర కూడా చేశారు. గీతా ప్రోద్భలంతోనే హర్భజన్ సింగ్ సినిమాల్లో నటించేందుకు మొగ్గచూపుతున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: