రాజ‌మౌళి త్రివిక్ర‌మ్ వీరిద్ద‌రూ టాలీవుడ్‌లో టాప్‌ స్టార్ రైట‌ర్లుని చెప్ప‌వ‌చ్చు.  ఇద్ద‌రిది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లానే. ఆయ‌న మాట‌ల మాంత్రికుడుగా టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయితే.   ఈయ‌న టాలీవుడ్ జ‌క్క‌న‌గా పేరు పొందాడు. ఇద్ద‌రూ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వాసులే కావ‌డం విశేషం. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి బ్యాక్‌గ్రౌండ్ త్రివిక్ర‌మ్‌కి ఉంటే. కీర‌వాణి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ బ్యాక్‌గ్రౌండ్ రాజౌళికి ఉంది. బాహుబలితో రాజమౌళి రేంజ్ ఏంటనేది అందరికీ తెలిసిపోయింది. ఇలాంటి దర్శకుడికి సాధ్యం కాని రికార్డులు అంటూ ఉంటాయా.. ప్రస్తుతం టాలీవుడ్ రికార్డులన్నీ ఈయన సినిమాల పేరు మీదే ఉన్నాయి. అన్నింటికి ఒకే సమాధానం బాహుబలి. అందుకే రాజమౌళి కూడా దర్శక బాహుబలి అయ్యాడు. అయితే ఇన్ని రికార్డులు సాధించిన రాజమౌళి.. ఒక్క విషయంలో మాత్రం త్రివిక్రమ్ కంటే వెనకాల ఉన్నాడు. అదేనండి ఓవ‌ర్సీస్ విష‌యంలో కాస్త వెన‌క‌ప‌డ్డారు.

 

మాటల మాంత్రికుడి ధాటికి దర్శకధీరుడు కూడా కాస్త సైడ్ ఇచ్చాడు. సుకుమార్ నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాతో రెండుసార్లు.. రాజమౌళి రెండుసార్లు ఈ రికార్డ్ అందుకున్నారు. అందులో త్రివిక్రమ్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడే అప్‌డేట్ అవ్వ‌క‌పోతే మ‌న‌గ‌డ‌కే ప్ర‌మాద‌మ‌వుతుంది. సినిమా ప్ర‌పంచంలో ఇది బాగా వ‌ర్తిస్తుంది. అది ఆర్టిస్ట్‌ల‌కైనా.. ద‌ర్శ‌కుల‌కైనా స‌రే. రాజ‌మౌళి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ప‌రాజ‌యం కూడా చ‌విచూడ‌క‌పోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త అని చెప్పాలి. రాజ‌మౌళి తీసిన 11 చిత్రాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ అని చెప్పాలి. అలాగే రాజ‌మౌళి సినిమాల‌లో హీరోల‌తో పాటు విల‌న్‌ల‌కు కూడా స‌మాన‌మైన పేరు వ‌స్తుంది. అంత‌లాగా ఆయ‌న విల‌న్ పాత్ర‌ల‌ను సృష్టించ‌డంలో దిట్ట అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఆయ‌న తీయ‌బోయే త్రిపుల్ ఆర్ మూవీ కోసం అభిమానులు వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తున్నారు. 

 

ప‌దునైన సంభాష‌ణ‌ల‌కు త్రివిక్ర‌మ్ పెట్టింది పేరు. ఏ విష‌య‌మైన సంభాష‌న క్లుప్తంగా ఆలోచ‌న రేకెత్తించే విధంగా ఉంటుంది. ఆయ‌న‌క‌లం నుండి వెండితెర‌కు జాలువారిన కొన్ని సంభాష‌ణ‌లు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ జ‌నాల నోళ్ళ‌లో నానుతుంటాయి. మాట‌ల ర‌చ‌యిత‌గా త‌న సినీ ప్ర‌స్థానాన్ని మొద‌లు పెట్టి మాట‌ల‌తోనే పేరు సంపాదించి ఆ త‌ర్వాత మెగా  ఫోన్ ప‌ట్టుకుని 2002లో నువ్వే నువ్వే చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. మంచి హిట్ కొట్టాడు ఆ త‌ర్వాత చేసిన అత‌డు చిత్రంతో ఒక్క‌సారిగా త‌న ప్ర‌తిభ ఏంటో చాటి చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: