టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాల కోసం ఇక్కడికి వస్తున్న అమ్మాయిలను, కొందరు మేనేజర్లు అవకాశాలు ఇప్పిస్తాం అని లైంగిక ఇబ్బందులు పెడుతున్నారని, అయితే అటువంటి ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు మాత్రం ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నారని అంటూ వర్ధమాన నటి శ్రీరెడ్డి ఇటీవల టాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో పెను సంచలనం సృష్టించిన ఆ ఘటన అనంతరం శ్రీరెడ్డి పేరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగింది. ముందుగా టాలీవుడ్ పెద్దలు కొత్తగా వస్తున్న అమ్మాయిల విషయమై భద్రత కల్పించేందుకు దిగి రాకపోవడంతో మా అసోసియేషన్ ముందు శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేయడం, ఆపై సినీ పెద్దలు దిగివచ్చి మా అసోసియేషన్ లో ఆడవారికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం అని మాటివ్వడం జరిగింది. నిజానికి ఆ ఘటనతో శ్రీరెడ్డి కి మంచి పేరు లభించినప్పటికీ, 

 

దాని తరువాత ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ నుండి ఆమెకు వ్యతిరేకత ఎదురైంది. అలానే పలువురు టాలీవుడ్ వ్యక్తుల పేర్లు బయటపెడుతూ వారు తనను లైంగికంగా వాడుకున్నారని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలను చాలా మంది ఖండించారు. ఆ తరువాత నుండి కూడా మరింతగా తన విమర్శలను ఏ మాత్రం ఆపని శ్రీరెడ్డి, ఇటీవల హైదరాబాద్ నుండి చెన్నై కి వెళ్లిపోయింది. అయితే ఇప్పటికీ కూడా కొందరు నటులు, రాజకీయనాయకుల పై మాత్రం ఇంకా విమర్శలు చేస్తూనే ఉంది. అయితే మొదట్లో క్యాస్టింగ్ విషయమై ఆమె ఆరోపణలు చేసిన సమయంలో ఆమె రకుల్ ప్రీత్ పేరు ప్రస్తావించింది. వేరే రాష్ట్రాల నుండి హీరోయిన్లను తెచ్చుకుంటున్న ఇక్కడి దర్శక నిర్మాతలకు మన తెలుగు అమ్మాయిలంటే పడదని, నిజానికి తన లాంటి వారిదగ్గర లేనిది రకుల్ వంటి వారిదగ్గర ఏముందని శ్రీరెడ్డి ప్రశ్నించడం, అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలకు బదులిస్తూ, తనకు మాత్రం ఎటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఎదురుకాలేదని రకుల్ సమాధానం ఇవ్వడం జరిగింది. 

 

దానికి రియాక్ట్ అయిన శ్రీరెడ్డి, పిచ్చ పిచ్చ గా ఉందా, పళ్ళు రాలిపోతాయి రకుల్, నీకు ఎదురుకాకపోతే ఎందరో ఇక్కడికి వస్తున్న అమ్మాయిలు ఇటువంటి ఇబ్బందులు పడుతూ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఎక్కడినుండో ఇక్కడికి వచ్చి నువ్వు మాలాంటి ఇబ్బందులు పడుతున్న వారికి మద్దతు ఇవ్వకపోగా అదేమీ లేదనడం నిజంగా ఘోరం అని వ్యాఖ్యానించింది. అయితే ఇటీవల టాలీవుడ్ లో రకుల్ పరిస్థితి ఒక్క అవకాశం లేకుండా ఎంతో దారుణంగా తయారవడంతో కొంత ఆనందపడుతున్న శ్రీరెడ్డి, ఆరోజు నేను చెప్పానుగా పళ్ళు రాలగొడతాను అని, అయితే ఇప్పుడు అదే జరిగింది. నిజానికి దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు, అందుకే రకుల్ కి ఒక్క అవకాశం కూడా లేకుండా ఆయనే  పళ్ళు రాలగొట్టాడుగా అంటూ తన సన్నిహితుల వద్ద ఆనందపడుతూ మాట్లాడుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: