టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెకెక్కిన బద్రి సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీ తో బెస్ట్ హిట్ కొట్టిన పూరి, ఆ తరువాత వరుసగా మంచి విజయాలు అందుకుని పేరు సంపాదించాడు. అయితే ఇటీవల కొన్ని పరాజయాలు అందుకున్న పూరి, కొద్దిరోజుల క్రితం రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు. ఇక పూరి కొడుకు ఆకాష్, చిన్నతనంలోనే పలు సినిమాల్లో బాలనటుడిగా నటించి మంచి పేరు గడించాడు. ఇక ఇటీవల 2015లో ఆకాష్ హీరోగా మారి ఎంట్రీ ఇచ్చిన సినిమా ఆంధ్రాపోరి. ఉల్కా గుప్తా హీరోయిన్ గా తెరకెక్కిన ఆ సినిమాకు రాజ్ ముదిరాజ్ దర్శకత్వం వహించాడు. 

 

అయితే మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. ఇక రెండవ సినిమాతో కొడుకుకు మంచి హిట్ ఇచ్చే భారాన్ని తనపై వేసుకున్న పూరి, అతడితో మెహబూబా అనే యాక్షన్ లవ్ స్టోరీ ని గత ఏడాది తీసాడు. అయితే ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. కానీ హీరోగా ఆకాష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రస్తుతం ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా రొమాంటిక్. పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్. కాగా ఆ సినిమాకు నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు .ఇక ఇటీవల రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఆ లుక్ లో ఎక్స్పోజింగ్ అనే మాటని పీక్స్‌లో చూపించి, చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అనేలా ప్రెజెంట్ చేసింది సినిమా యూనిట్. 

 

ఆ పోస్టర్‌లో కేతికా శర్మ టాప్ లెస్‌గా ఆకాశ్ పూరిని గట్టిగా హత్తుకుని ఉండడం గమనించవచ్చు.ఇక నేడు ఈ సినిమా నుండి సెకండ్ లుక్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, మరొక అడుగు ముందుకేసి, హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా ఘాటుగా ముద్డుకుంటున్న సీన్  పోస్టర్ ని రిలీజ్ చేసి, తమ సినిమా మే 29న రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసారు. ఆ సినిమా టైటిల్‌కి జస్టిఫికేషన్ చేస్తూ ఫస్ట్ లుక్‌ తో పాటు నేడు రిలీజ్ చేసిన ఈ లుక్ ని బట్టి చూస్తుంటే, ఇప్పుడే ఈ రేంజ్‌లో రొమాంటిక్ ట్రీట్ ఇచ్చారంటే, ముందు ముందు సినిమాలో ఇంకెలాంటి హాట్ డోస్ ఉండబోతుంది అనేది అర్ధం చేసుకోవచ్చని అంటూ కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: