గత ఏడాది నందమూరి బాలకృష్ణ కు ఏమాత్రం కలిసిరాలేదు. ఎన్నడూ లేని విధంగా 2019 సంవత్సరంలో బాలకృష్ణ ఏకంగా మూడు సినిమాలు చేయడం జరిగింది. మూడు సినిమాలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ ఏడాది ఎలాగైనా బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా తో మళ్లీ బౌన్స్ అవ్వాలని చూస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమా లో సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటుగా బాలకృష్ణ కెరియర్ లో చాలా రికార్డులు సృష్టించడంతో రాబోతున్న మూడో సినిమా పై బాలకృష్ణ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా శరవేగంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలు కానున్నట్లు వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు మరియు లుక్ విషయంలో సరికొత్త వార్తలు ఇండస్ట్రీలో తాజాగా వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే సినిమాలో సమరసింహా రెడ్డి టైపు లో బాలకృష్ణ పోలికలు ఉంటున్నట్లు ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా  ఫ్యాక్షనిస్ట్ పాత్ర నుండి అఘోరాగా బాలయ్య ఈ సినిమాలో నటించనున్నట్లు అందుకే గుండు తో ఉన్న లుక్ తో బాలయ్య ఉన్నట్లు సమాచారం.

 

అయితే సినిమా షూటింగ్ మొదలు గానే ఫస్ట్ షెడ్యూల్ లోనే అఘోరా ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నట్లు సినిమాకి ఇదే కీలకమని ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ఫ్యాక్షనిస్టు పాత్రలో కూడా సమరసింహారెడ్డి లో రైల్వే స్టేషన్ దగ్గర విలన్ మెడ పట్టుకొని బాలయ్యబాబు ట్రైన్ లో ఉండే సేమ్ సన్నివేశం టైపు బోయపాటి చేయబోయే సినిమాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాపై నందమూరి అభిమానులకు చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: