కొంత మంది ద‌ర్శ‌కులు వాళ్ళు ఎలా చెపితే అలానే వినాలి అంటారు. మ‌రికొంత మంది అయితే వ‌దిలేస్తారు కాని.. కొంత‌మంది చాద‌స్తంతో వారు చెప్పిందే వినాలి. చెప్పిన‌ట్లు చెయ్యాలి అంటుంటారు. అలాంటి ద‌ర్శ‌కుల్లో సుకుమార్ కూడా ఒక‌రు అని కొంద‌రు అంటున్నారు. సుకుమార్ నాన్న‌కు ప్రేమ‌తో చిత్రం స‌మ‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను చాలా ఇబ్బందుల‌కు గురి చేశాడంట‌. అదేమిటంటే...

 

చనిపోయిన తన తండ్రి గౌరవార్ధం ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకొన్నారు సుకుమార్‌. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇది జూనియర్‌ ఎన్టీఆర్‌కి 25వ సినిమా. తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి భావోద్వేగపు బంధాన్ని చూపించే కథగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా 2016 జనవరి 13న రిలీజ్‌ అయింది. ఇది విమర్శకుల నుంచి కూడా పాజిటివ్‌ రివ్యూస్‌ని సంపాదించుకుంది. విదేశాలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ తెలుగు చిత్రంగా ‘నాన్నకు ప్రేమతో’ నిలిచింది. ఈ సినిమా వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది నాన్న‌ల‌ను ఎలా ప్రేమించాలి అన్న‌ది కూడా తెలుసుకున్నాడు. 

 

 ద‌ర్శ‌కుడు సుకుమార్ సినిమాలో నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో చాలా క్లాస్‌గా చూపించాడు. ఒకానొక ద‌శ‌లో మ‌రీ క్లాస్ ఎక్కువ‌యిపోయింద‌ని ఎన్టీఆర్ ఇబ్బందిప‌డ్డాడంట‌. ఎందుకంటే ఎన్టీఆర్ ఎక్కువ‌గా మాస్ సినిమాల్లోనే న‌టించాడు కాబ‌ట్టి. అయితే క్లాస్ లుక్‌లో త‌న‌ను చూస్తారో లేదో అన్న సందేహం ఎక్కువ‌గా ఉండేద‌ట‌. కానీ సుకుమార్ మాత్రం తాను చెప్పిందే వినాల‌న్న‌ట్లు ప్ర‌వ‌ర్తించేవాడ‌ట. సుక్కు నువు నన్ను మ‌రీ క్లాస్‌గా చూపిస్తున్నావ్ న‌న్ను ఇలా ప్రేక్ష‌కులు చూస్తారో లేదో అంటూ గోల పెట్టేవాడంట‌. లేదు లేదు తార‌క్ నేను ఇలాగే చూపిస్తా అనేవాడ‌ట‌. చివ‌రికి క్లాస్ డ్ర‌స్ వేసుకుని ఏద‌న్నా ఒక సంద‌ర్భంలో కింద కూర్చుంటే హే తార‌క్ కింద కూర్చోకు డ్ర‌స్ న‌లిగిపోత‌ది అంటూ చాలా ఇబ్బంది పెట్టేసేవాడ‌ట‌. కావాలంటే నేను నీకు స్టూల్ వేస్తాను. నేను స్టూల్ ప‌ట్టుకుని తిరుగుతా అంటూ చాద‌స్తంతో ఇబ్బంది పెట్టేసేవాడ‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: