తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టిక‌ప్పుడు కాంపిటేష‌న్ పెరుగుతూ వ‌స్తుంది. ఒక‌ళ్ళు టాప్ లో ఉన్నారంటే...ఎప్ప‌టికే వారే టాప్‌లో ఉంటార‌ని చెప్ప‌లేం. పెద్ద సినిమాలు ఎన్ని చేసినా ఎన్ని హిట్లు కొట్టినా లైఫ్‌ని ట‌ర్న్ చేయ‌డానికి ఒక్క ఫ్లాప్ చాలు. ఎప్పుడైతే ఒక ఫ్లాప్ ప‌డుతుందో ఇక డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిన‌ట్టే. కొత్త‌నీరు వ‌స్తుంటే పాత‌నీరు పోతుంది అన్న‌ట్టు రోజూ ఒక కొత్త టాలెంట్ వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. అలా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి విజ‌యాలు సాధిస్తున్నాడు. ఒక సాదా సీదా ఆర్టీసీ డ్రైవ‌ర్ కొడుకు అనిల్‌రావిపూడి. అనిల్ ప్ర‌కాశం జిల్లా చిలుకూరివారి పాలెంలో జ‌న్మించాడు.

 

అనిల్ ఇంజ‌నీరింగ్ కంప్లీట్ చేసి ఈ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టాడు. అనిల్ ముందు అత‌ని అంకుల్ ద‌గ్గ‌ర స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశాడు. అలా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన త‌మ్ముడు చిత్రంతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడ‌ట‌. తర్వాత డైలాగ్ రైట‌ర్‌గా కూడా ప‌లు సినిమాలు ప‌ని చేశాడు. కందిరీగ చిత్రంతో డైలాగ్‌రైట‌ర్‌గా మంచి పేరు వ‌చ్చింది. అనిల్‌రావిపూడి డైరెక్ట‌ర్ అవ్వ‌క ముందు శ్రీ‌నువైట్ల ద‌గ్గ‌ర ప‌నిచేశాడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప్ల‌స్ స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌ని చేశాడు.  అంతేకాక మ‌హేష్‌బాబు ఆగ‌డు సినిమాకు కూడా ప‌నిచేశాడు. ఆగ‌డు ఫ‌స్టాఫ్ ప‌నిచేశాక‌. క‌ళ్యాణ్‌రామ్ ఛాన్స్ ఇచ్చాడ‌ని సెకండాఫ్ చెయ్య‌కుండానే వ‌దిలేసి వెళ్ళిపోయాడ‌ట‌. ప‌టాస్ మంచి హిట్ కొట్టింది.

 

త‌ర్వాత దిల్‌రాజు త‌న సుప్రీమ్ చిత్రం ఛాన్స్ ఇచ్చాడు అది కూడా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది.  అయితే అత‌డు  సినిమా ఫ్లాప్ అయింది. త‌ర్వాత శ్రీ‌నువైట్ల చాలా సార్లు క‌లిసిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయ‌ట‌. అప్పుడు ఆయ‌న అనిల్‌తో  ఆగడుమ‌ధ్య‌లో వెళ్ళిపోయావు సినిమా ఫ్లాప్ అయింది అనేవార‌ట‌. దీంతో నీ సంగ‌తి ఏంటో తేలుస్తా అంటూ స‌ర‌దాగా అనేవాడ‌ట‌. అది నాకు చాలా బాద అనిపించింది అని అనిల్ చాలా ఇంట‌ర్వ్యూల్లో తెలిపారు. నిజంగా నేను చేసి ఉంటే హిట్ అయ్యేదేమో అని కొన్ని సార్లు వాపోయాడు. అలా శ్రీ‌నువైట్ల వార్నింగ్ ఇచ్చాడ‌ని చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: