నేచురల్ స్టార్  నాని ,సుధీర్ బాబు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం వి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసింది చిత్ర బృందం అందులో భాగంగా కొద్దీ రోజుల క్రితం  ఈ చిత్రం నుండి నాని , సుధీర్ బాబు ల ఫస్ట్ లుక్ విడుదలకాగా తాజాగా మరో పోస్టర్ ను విడుదలచేశారు. పోస్టర్ లో టీజర్ డేట్ ను కూడా ప్రకటించారు. 
 
ఈనెల 17న వి టీజర్ విడుదలకానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్  మోహన్ కృష్ణ ఇంద్రగంటి  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  నాని విలన్ పాత్రలో కనిపించనుండగా సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.  దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో  నివేధ థామస్ , అధితి రావ్ హైదరి కథానాయికలు నటించారు. ఉగాది కానుకగా  మార్చి 25న ఈ చిత్రం విడుదలకానుంది. కాగా నాని కి ఇది 25వ సినిమా కావడం విశేషం 
 
ఇక ఈ సినిమా తరువాత  నాని, శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీశ్ అనే చిత్రం లో నటించనున్నాడు. రేపటి నుండి  ఈ సినిమా షూటింగ్  పొల్లాచి లో ప్రారంభం కానుంది. ఈచిత్రంలో  రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించననుండగా థమన్  సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈచిత్రం జులై లో విడుదలకానుంది. ఇక మరో హీరో సుధీర్ బాబు మాత్రం చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ఒక్క సినిమా తో కూడా ప్రేక్షకులముందుకు రాలేకపోయినా  అయన  వి తరువాత ఇంతవరకు మరో సినిమాకు  కమిట్ అవ్వలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: