టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్సే ఎక్కువగా పరిచయమవుతుంటారు. మనవాళ్ళు ఎక్కడో ముంబాయి నుండో, డిల్లీ నుండో మోడల్స్ ని తీసుకు వచ్చి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం చేసి ఆ తర్వాత సక్సల సౌకర్యాలు కల్పిస్తుంటారు. ఒకటి అరా హిట్స్ పడితే అందరు అవకాశాలిచ్చి ఆదరించి నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ తర్వాత స్టార్ స్టేటస్ ఆటో మెటిక్ గా వచ్చేస్తుంది. అంతే ఇక మన బ్యూటీలు మొదలు పెడతారు. మహేష్ బాబు లాంటి హీరోలు అడిగినా డేట్స్ లేవని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. 

 

పెద్ద డైరెక్టర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ అడిగినా గీరెక్కి కొట్టుకుంటూ పొగరు చూపిస్తుంటారు. మొదటి సినిమాకి పదిరెట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు. ఏమన్నా అంటే మా హీరోయిన్స్ కి లైఫ్ టైం తక్కువ. వాడుకుంటున్నారు కదా ..రెండేళ్ళ తర్వాత మమ్మలిని పట్టించుకోరు కదా ..ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటారు కదా అంటూ సెటైర్స్ వేస్తూ కృతజ్ఞాతా హీనులు గా మాట్లాడతారు. మరి ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో ఆదరింపబడిన సౌందర్య లాంటి వాళ్ళని చూసి వీళ్ళు ఏం నేర్చుకున్నారో తెలీదు గాని ..ఆవిడే మాకు ఇన్స్పిరేషన్ అని మాత్రం సొల్లు మాటలు చెబుతుంటారు.

 

ఇక్కడ రెండు హిట్లు పడే వరకు అనిగి మణిగి ఉంటారు. ఆ తర్వాత బాలీవుడ్ పిలుస్తుందంటూ ఇక్కడ కమిటయిన సినిమాలని నట్టేట్లో ముంచి ముంబాయి ఫ్లైటెక్కేస్తారు. అవసరం అయితే మానేజర్స్ ని మార్చేస్తారు. లేదా ఇష్టమొచ్చినట్లు రెమ్యూనరేషన్ అడిగి అందుకు అదనంగా ఎక్స్ట్రా చార్జెస్ నిర్మాత నెత్తి మీద పడేస్తారు. అంతేనా సెట్ లో హీరోల ముందే లెక్కలేని తనాన్ని చూపిస్తుంటారు. డైరెక్టర్స్ కే స్క్రిప్ట్ లో చేంజెస్ చెప్పి నానా తంటాలు పెడుతుంటారు.

 

పోనీ బాలీవుడ్ వెళ్ళిన వాళ్ళు అక్కడ సెటిలవుతారా అంటే అదీ ఉండదు. ఒక సినిమా పోగానే వాళ్ళు చీదరించుకుంటారు. దాంతో మీరే దిక్కంటూ మళ్ళీ ఎగిరి తన్నిన బంతిలా వచ్చి ఇక్కడే పడతారు. అయితే మనవాళ్ళు కూడా ఈ విషయంలో ముదిరిపోయారు. ఇంతకముందులా ఇలాంటి హీరోయిన్స్ ని భరించడం లేదు. ఒక్కసారే చూస్తున్నారు. రెండవసారి తొక్కిపెట్టి నార తీసి గెంటేస్తున్నారు. ఇలాంటి హీరోయిన్సే మంచి టాలెంట్ ఉండి, అందం ఉండి కూడా ఈ ఒళ్ళు పొగరుతో కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. పెద్ద సినిమాలన్ని పోగొట్టుకుంటునారు.    

 

మరింత సమాచారం తెలుసుకోండి: