స్టార్ హీరోలకు తాము నటించే సినిమాలకు సంబంధించి విపరీతమైన సెంటిమెంట్స్ ఉంటాయి. వారి సినిమాల టైటిల్స్ లోని అక్షరాల సంఖ్య నుండి వారు తమ మూవీ ఫంక్షన్స్ కు వేసుకు వచ్చే షర్ట్స్ కలర్ వరకు అనేక సెంటిమెంట్స్ ను ఫాలో అవుతూ ఉంటారు. 


అయితే సెంటిమెంట్స్  తనకు లేవు అని చెప్పుకునే విజయ్ తన సినిమాలో ఒక విచిత్రమైన సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉంటాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ బైక్ నడిపేటప్పుడు మిడిల్ ఫింగర్ బయటపెట్టి అన్ని వేళ్ళు మూయడం అతడి అలవాటు. 


ఆ అలవాటుతో ఉన్న సీన్స్ గలిగిన ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ మూవీలు  సూపర్ హిట్ కావడంతో ఈ వారం రిలీజ్ కాబోతున్న వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో కూడ విజయ్ బైక్ నడుపుతూ మిడిల్ ఫింగర్ బయటకు పెట్టి మిగతా అన్ని వేళ్ళు మూసిన సీన్ ఫ్రేమ్ ను హైలెట్ చేస్తూ ఈ మూవీ నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ వదిలారు. దీనితో ఈ లేటెస్ట్ స్టిల్ చూసిన విజయ్ అభిమానులు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బ్లాక్ బష్టర్ హిట్ అంటూ ప్రచారం మొదలుపెట్టేసారు. 


వాస్తవానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు విడుదలై రిజల్ట్ బయటకు రాకుండానే ఈ మూవీ పై విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన ఒక సెంటిమెంట్ ఇప్పుడు ప్రచారంలోకి రావడంతో విజయ్ అభిమానులతో పాటు ఈ మూవీ బయ్యర్లు కూడ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఇక భవిష్యత్ లో తాను ప్రేమ కథల సినిమాలలో నటించను అంటూ విజయ్ చేసిన ప్రతిజ్ఞ పై ఇంకా ఈమూవీ రిజల్ట్ బయటకు రాకుండానే వెనకడుగు వేస్తూ తన ఒట్టు ను పక్కకు పెట్టి కేవలం తాను జోక్ కు అలా అన్నాను అంటూ తాను యాక్షన్ సినిమాలతో పాటు లవ్ స్టోరీస్ సినిమాలను కూడ చేస్తాను అంటూ తనను సంప్రదిస్తున్న దర్శక నిర్మాతలకు విజయ్ క్లారిటీ ఇస్తున్నట్లు సమాచారం..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: