సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎలా ఉంటాదో ఎవరు ఊహించలేరు. ఈ కాలంలో ఎవరైనా దర్శకుడు వరసగా రెండు ప్లాపులిస్తేనే ఆ దర్శకుడిని ఇండస్ట్రీ జనాలు లైట్ తీసుకుంటారు. గతంలో ట్రాక్ రికార్డ్ ఎంత బాగున్నా సరే ఇప్పుడు సక్సెస్ ఉన్న వాడిదే ఇక్కడ రాజ్యం. అందులోనూ సీనియర్ దర్శకుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఒక్క ప్లాప్ ఇచ్చినా అవుట్ డేట్ అయిపోయావ్ అనేస్తారు.

 

ఒక దర్శకుడు గత దశాబ్ద కాలంగా అసలు ఫామ్ లో లేడు. అతను చేసిన చేస్తున్న సినిమాల బట్టి ఎప్పుడో అవుట్ డేట్ అయిపోయాడన్న ఫీలింగ్ ప్రేక్షకులకు ఇట్టే కలుగుతుంది. ఆయన లాస్ట్ హిట్ కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం అంటే అర్ధం చేసుకోండి ఆ దర్శకుడి రీసెంట్ ట్రాక్ రికార్డ్.

 

ఇప్పటికైనా అర్థమైందా ఆ దర్శకుడెవరో. ఇంకా ఐడియా రాకపోతే ఆ దర్శకుడి రీసెంట్ సినిమా పేరు వింటే క్లారిటీ వచ్చేస్తుంది. గతేడాది ఆఖర్లో నందమూరి బాలకృషకి రూలర్ అంటూ ఒక కళాఖండాన్ని ఇచ్చాడు. ఆ దర్శకుడే కెఎస్ రవి కుమార్.

 

ఐడియాల పరంగా, దర్శకత్వం పరంగా ఎప్పుడో అవుట్ డేట్ అయిపోయిన కెఎస్ రవికుమార్ తెలుగులో గత రెండేళ్లలో రెండు సినిమాలు చేసాడు. అందులో ఒకటి జై సింహా, కంటెంట్ వీక్ గా ఉన్నా సంక్రాంతి అడ్వాంటేజ్ తో ఓ మోస్తరుగా ఆడేసింది. ఇక రూలర్ గురించి చెప్పుకోవడం అనవసరం. 

 

ఈ దర్శకుడి గురించి ఎందుకు అంటే.. కె ఎస్ రవికుమార్ ప్రస్తుతం తమిళంలో ఒక బడా సినిమాను పట్టాడు. అజిత్ తో సినిమా కన్ఫర్మ్ అయిందని స్వయంగా రవి కుమార్ ప్రకటించాడు. 16 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి పనిచేయబోతున్నామని తెలిపాడు. ఎప్పుడో అవుట్ డేట్ అయిపోయిన ఈ దర్శకుడిలో ఏం చూసి అజిత్ సినిమా ఛాన్స్ ఇచ్చాడో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: